Hanuman Review : స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతూ ఈ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ భారీగా ఆకర్షించిన సినిమా 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన సూపర్ హీరో చిత్రమిది. బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమానే అయినప్పటికీ కంటెంట్ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా థియేటర్లలోకి వచ్చింది. టీజర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం ట్రైలర్‌తో ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని 'హను-మాన్' అందుకున్నాడా? (Hanuman Movie Review) తెలుసుకుందాం...
కథేంటంటే : మన ఇతిహాసాల్లోని రియల్ సూపర్ హీరో హనుమంతుడు. మరి ఆయన శక్తులు ఓ సామాన్యుడికి వస్తే ఏం జరిగింది? ధర్మాన్ని కాపాడేందుకు, ఊరి ప్రజల్ని రక్షించేందుకు అతడు ఏం చేశాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం.
చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని బలమైన కోరికతో ఉంటాడు సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌కు(వినయ్ రాయ్). అందుకోసం తనకు అడ్డు వస్తున్నారని చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత సూపర్ హీరోగా మారేందుకురకరకాల ప్రయోగాలు చేసినా అవి ఫలించవు. కానీ అలానే చేస్తుంటాడు. కట్ చేస్తే - పాలెగాడు గజపతి(దీపక్ శెట్టి) అకృత్యాల మధ్య నలిగిపోతున్న అంజనాద్రికి ఊరుకు కథ మారిపోతుంది. తనను ఎదిరించిన వాళ్లను ఊరి మధ్యలోనే కుస్తీ పోటీల్లో మట్టుపెడుతుంటాడు గజపతిని. అయితే ఆ ఊరిలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరిగే హనుమంతు (తేజ సజ్జా) - తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి అక్క అంజమ్మ (వరలక్ష్మీ) దగ్గరే పెరుగుతాడు.
మన హనుమంతుకు మీనాక్షి (అమృత అయ్యర్) అంటే చెప్పలేనంత ప్రేమ. అయితే ఆమె ఓరోజు గజపతికి ఎదురు తిరగడంతో అతడు తన బందిపోటు ముఠాతో ఆమెపై దాడి చేయిస్తాడు. అప్పుడు ఆ దాడి నుంచి మీనాక్షిని కాపాడే క్రమంలో తీవ్రంగా ప్రయత్నించి గాయపడతాడు హనుమంతు. అప్పుడు అతడిని బందిపోటు ముఠా నీళ్లలో పడేయగా అక్కడ అతనికి ఆంజనేయస్వామి రక్త బిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది. అంటే ఒక్కసారిగా హనుమంతు జీవితం మారిపోతుంది. ఆంజనేయుడి శక్తులు అతడికి వరిస్తాయి. మరి ఆ తర్వాత ఆ శక్తులతో అతడు చేసిన సాహసాలేంటి? హనుమంతు దగ్గరున్న రుధిరమణిని దక్కించుకునేందుకు మైఖేల్ ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి విభీషణుడు (సముద్రఖని) ఎలాంటి సాయం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే!
-
#Hanuman #HanumanReview #HanuManRAMpage #Prabhas #BlockbusterHanuman
— vinuragava (@ragava340070) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
No words blockbuster.....
Waiting part 2..
Jai Hanuman.....🙏 pic.twitter.com/Oi7muExHf2
">#Hanuman #HanumanReview #HanuManRAMpage #Prabhas #BlockbusterHanuman
— vinuragava (@ragava340070) January 11, 2024
No words blockbuster.....
Waiting part 2..
Jai Hanuman.....🙏 pic.twitter.com/Oi7muExHf2#Hanuman #HanumanReview #HanuManRAMpage #Prabhas #BlockbusterHanuman
— vinuragava (@ragava340070) January 11, 2024
No words blockbuster.....
Waiting part 2..
Jai Hanuman.....🙏 pic.twitter.com/Oi7muExHf2
Hanuman Movie Review ఎలా సాగిందంటే: ఫస్ట్ ఆఫ్ విషయానికొస్తే - సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే ప్రేక్షకులకు కథను పరిచయం చేసే ప్రయత్నం చేశారు. కథలో కీలకమైన రుధిరమణి కథను మొదట్లోనే వివరించి, అనంతరం విలన్ చిన్ననాటి ఎపిసోడ్‌తో సినిమాను ఇంట్రెస్టింగ్గా ప్రారంభించారు. సూపర్ హీరో అవ్వాలనే బలమైన కోరికతో మైఖేల్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలోనే తనకు అడ్డుగా నిలిచిన తల్లిదండ్రుల్ని చంపడం, మిస్టరీ మ్యాన్ అవతారంలో బ్యాంకు దొంగతానికి వచ్చిన ఓ రౌడీ ముఠాను చితక్కొట్టడం, అన్నీ ఆకట్టుకునే తీశారు. అంజనాద్రి ఊరును పరిచయం చేసిన తీరు అద్భుతం. కానీ, ఆ తర్వాతే కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. హీరోను పరిచయం చేసిన సీన్స్ ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. మీనాక్షి - హనుమాన్ ప్రేమకథ పెద్దగా ఫీల్ కనిపించదు. ఊరి పాలెగాడు గజేంద్రకు మీనాక్షి ఎదురు తిరగడం, అతడు మీనాక్షిని చంపేందుకు బందిపోటు ముఠాను పంపించంతో కథ వేగం పుంజుకుంటుంది. అప్పుడే ఆ ముఠా చేతిలో చావు దెబ్బలు తిన్న హీరోకు నదిలో పడటం, అక్కడ అతనికి రుధిరమణి దొరకడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. హనుమంతుకు సూపర్ పవర్స్ వచ్చినప్పటి నుంచి కథ వేగంగా పరుగులు పెడుతుంది. అతడు తన శక్తుల్ని ఉపయోగించి స్కూల్లో ఉన్న విలన్లకు బుద్ధి చెప్పే సన్నివేశాలు భలే నవ్వులు పూయిస్తాయి. ఇక ఇంటర్వెల్ ముందు పాలెగాడు గజేంద్రతో అతడు కుస్తీ పోటీలో పాల్గొనే ఎపిసోడ్ కూడా భలే ఉంటుంది. అదే సమయంలో మైఖేల్ కూడా అంజనాద్రికి రావడంతో సెకండాఫ్‌పై మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది.
సెకండాఫ్ విషయానికొస్తే - రుధిరమణిని కోసం మైఖేల్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలోనే అతడి ద్వారా అంజనాద్రి గ్రామానికి ముప్పు ఏర్పడటం, ఆ ముప్పు నుంచి ఊరిని, ఊరి ప్రజల్ని కాపాడేందుకు హనుమంతు చేసే ప్రయత్నాలను చూపించారు. ఈ మధ్యలోనే ఆవకాయ ఆంజనేయ సాంగ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, పెళ్లిలో హనుమంతుపై దాడి జరిగినప్పడు అతడి అక్క అంజమ్మ పోరాడే తీరు బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మైఖేల్ స్థావరంలోకి హనుమంతుడు ఎంట్రీ ఇచ్చినప్పుడు అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్‌గా ఉంటుంది. ఇక చివరి 20నిమిషాలు క్లైమాక్స్ గూస్ బంప్స్. ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. హిమాలయాల్లోని హనుమంతుడు లోక కల్యాణార్థం తిరిగి వచ్చే సీన్స్ పూనకాలు తెప్పిస్తాయి. 'రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?' అనే ఓ ఆసక్తికరమైన ప్రశ్నతో రెండో భాగానికి లీడ్ ఇస్తూ సినిమాను అద్భుతంగా ముగించారు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే 'జై హనుమాన్' వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
టెక్నికల్ విషయానికి వస్తే వీఎఫ్ఎక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హనుమాన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులు సీట్లకు అత్తుకుపోయేలా సినిమాను అద్భుతంగా రూపొందిచారు. ఎడిటింగ్, ఇతర విభాగాలు పనితీరు కూడా చాలా బాగున్నాయి. సూపర్ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి, ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా ప్రశాంత్ వర్మ కథను తీర్చిదిద్దుకున్న తీరు మెప్పిస్తుంది. ఫైనల్‌గా ఈ సినిమా థియేటర్‌లో చూస్తే తప్పకుండా మంచి అనుభూతి కలుగుతుంది.
-
#HanuMan
— CineManiac (@sreekar08) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Muslim guy's review 👌
This movie can't get any better @PrasanthVarma 👏 pic.twitter.com/rSc5ZW4ibg
">#HanuMan
— CineManiac (@sreekar08) January 11, 2024
Muslim guy's review 👌
This movie can't get any better @PrasanthVarma 👏 pic.twitter.com/rSc5ZW4ibg#HanuMan
— CineManiac (@sreekar08) January 11, 2024
Muslim guy's review 👌
This movie can't get any better @PrasanthVarma 👏 pic.twitter.com/rSc5ZW4ibg
ఎవరెలా చేశారంటే: ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జా, సూపర్ పవర్స్ వచ్చాక అటు యాక్షన్‌లోనూ, ఇటు ఎమోషన్స్ సీన్స్‌లోనూ తేజ అద్భుతంగా నటించాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్ అందంగా కనిపించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర సెకాండాఫ్‌లో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర ఈ కథలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సత్య, గెటప్ శ్రీను, రాకేష్ మాస్టర్, వెన్నెల కిషోర్, తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని బాగా నవ్వించాయి.
సింపుల్‌గా చెప్పాలంటే - కథా నేపథ్యం, తేజ సజ్జా నటన, గ్రాఫిక్స్ హంగులు, నేపథ్య సంగీతం సినిమాకు బలాలుగా నిలిచాయి. అయితే అక్కడక్కడా నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా డివైనిటీ, ఎమోషన్స్, లవ్, కామెడీ తదితర అంశాలతో తెరకెక్కింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">