Hanuman Movie Pre Release Event : అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ హనుమాన్ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుంది. ఈ నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని, జనవరి 22న కుటుంబసభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని చెప్పారు.
-
Team #HANUMAN pledges to offer ₹5 for Ayodhya Rama Mandir from every ticket the audience buy in Theaters ❤️🙏
— Primeshow Entertainment (@Primeshowtweets) January 7, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
This graceful gesture is revealed by Mega 🌟 @KChiruTweets in Today's 'Celebrating HanuMan Pre-Release Utsav' 😍
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123
In WW… pic.twitter.com/i6ZABlQabd
">Team #HANUMAN pledges to offer ₹5 for Ayodhya Rama Mandir from every ticket the audience buy in Theaters ❤️🙏
— Primeshow Entertainment (@Primeshowtweets) January 7, 2024
This graceful gesture is revealed by Mega 🌟 @KChiruTweets in Today's 'Celebrating HanuMan Pre-Release Utsav' 😍
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123
In WW… pic.twitter.com/i6ZABlQabdTeam #HANUMAN pledges to offer ₹5 for Ayodhya Rama Mandir from every ticket the audience buy in Theaters ❤️🙏
— Primeshow Entertainment (@Primeshowtweets) January 7, 2024
This graceful gesture is revealed by Mega 🌟 @KChiruTweets in Today's 'Celebrating HanuMan Pre-Release Utsav' 😍
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123
In WW… pic.twitter.com/i6ZABlQabd
హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావడానికి కొన్ని కారణాలున్నాయి. నా ఆరాధ్య దైవం, అమ్మానాన్నల తర్వాత అనుక్షణం ప్రార్థించే వ్యక్తి ఆంజనేయస్వామి. ఆయనను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తీసిన సినిమా ఇది. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి డయాస్‌లు ఎక్కే స్టేజ్‌కు వచ్చిన తేజ సజ్జా మరో కారణం. ట్రైలర్, టీజర్ చూసినప్పుడు ప్రతి సన్నివేశంలో ఫైన్‌నెస్ కనిపించింది. తొలిసారి 'ఎవరీ డైరెక్టర్' అని అడిగి మరీ తెలుసుకున్నా. నేను కొలిచే హనుమంతుడి గురించి బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఆయనను పూజిస్తూ క్రమశిక్షణతో, నిబద్ధతతో ఈస్థాయికి వచ్చాను. ఇలాంటి వేదికపై హనుమాన్ గురించి కచ్చితంగా చెప్పాలి. అందుకే ఈ ఈవెంట్‌కు రమ్మని కోరగానే మరో ఆలోచన లేకుండా వచ్చేశా. హనుమంతుడు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. మా ఇంట్లో భక్తులెవరూ లేరు. మా నాన్న కమ్యూనిస్ట్. అమ్మ కోరిక మేరకు ఎప్పుడైనా తిరుపతి వెళ్లేవారు. అలాంటిది నేను ఏడో తరగతి చదువుతుండగా, పొన్నూరులో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి నమస్కారం చేసుకుని వచ్చేవాడిని" అని తెలిపారు.
-
Lifting the Mace of Confidence 💥
— Primeshow Entertainment (@Primeshowtweets) January 7, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Hero @tejasajja123 & director @PrasanthVarma with Mega 🌟 @KChiruTweets at 'Celebrating HanuMan Pre-Release Utsav' 🔥
- https://t.co/VH5mytXnqJ
In WW Cinemas from JAN 12, 2024 🔥@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809… pic.twitter.com/SCf8qGTGMS
">Lifting the Mace of Confidence 💥
— Primeshow Entertainment (@Primeshowtweets) January 7, 2024
Hero @tejasajja123 & director @PrasanthVarma with Mega 🌟 @KChiruTweets at 'Celebrating HanuMan Pre-Release Utsav' 🔥
- https://t.co/VH5mytXnqJ
In WW Cinemas from JAN 12, 2024 🔥@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809… pic.twitter.com/SCf8qGTGMSLifting the Mace of Confidence 💥
— Primeshow Entertainment (@Primeshowtweets) January 7, 2024
Hero @tejasajja123 & director @PrasanthVarma with Mega 🌟 @KChiruTweets at 'Celebrating HanuMan Pre-Release Utsav' 🔥
- https://t.co/VH5mytXnqJ
In WW Cinemas from JAN 12, 2024 🔥@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809… pic.twitter.com/SCf8qGTGMS
"ఒకసారి ఓ లాటరీలో ఆంజనేయ స్వామి ఫొటో వచ్చింది. దాన్ని ఇప్పటికీ ఫ్రేమ్ కట్టి పూజిస్తున్నా. హనుమాన్‌ను పూజించడం వల్ల నాన్న కోరుకున్న చోటుకు ట్రాన్స్‌ఫర్ అవడం వల్ల ఆయన కూడా భక్తుడిగా మారిపోయారు. భగవంతుడు బాహ్యంగా ఉండడు. మన అంతరాత్మలో ఉంటాడు. హనుమాన్ మనకు ఆశీస్సులు అందిస్తే జీవితాంతం వదలడు. మనల్ని నిరంతరం కాపాడుతూ, మార్గ నిర్దేశం చేస్తుంటాడు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ప్రశాంత్‌వర్మ ఆలోచనలు, హీరో తేజ కష్టం వేస్ట్ అవ్వవు. హను-మాన్ మూవీ గురించి గెటప్ శ్రీను మొదటిసారి నాకు చెప్పాడు. ఇది పరీక్షాకాలం. వరుస సినిమాలు ఉన్నప్పుడు ఎక్కువ థియేటర్‌లు దొరకకపోవచ్చు. ఇవాళ కాకపోతే రేపు చూస్తారు. ఫస్ట్ షో కాకపోతే, సెకండ్ షో చూస్తారు. కంటెంట్ బాగుంటే, ప్రేక్షకుల మార్కులు పడతాయి. చిత్ర బృందం అధైర్యపడొద్దు. విజయం మీదే. అయోధ్య రామమందిరానికి మీరు చేస్తున్న సాయం అభినందనీయం" అని చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">