ETV Bharat / entertainment

'వచ్చాడు కొత్త సూపర్​ హీరో'- ఆకట్టుకునేలా 'హనుమాన్'​ ఫస్ట్​ సింగిల్! - హనుమాన్​ సినిమా నటీనటులు

Hanuman Movie First Song Released : యువ నటుడు తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ 'హనుమాన్'. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడదల చేసింది చిత్ర యూనిట్​. 'వచ్చాడు కొత్త సూపర్​ హీరో.. మన హనుమాన్ ముందర అందరు జీరో​' అంటూ సాగే పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మీరూ ఓ సారి చూసేయండి.

Hanuman Movie First Song Released
Hanuman Movie First Song Released
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 6:56 PM IST

Updated : Nov 14, 2023, 7:50 PM IST

Hanuman Movie First Song Released : టాలీవుడ్ యువ నటుడు తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'హనుమాన్'. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జనవరి 12న (Hanuman Movie Release Date) ప్రేక్షకుల ముందుకు రానున్ను సందర్భంగా ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్​ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా 'వచ్చాడు కొత్త సూపర్​ హీరో.. మన హనుమాన్ ముందర అందరు జీరో​' అంటూ సాగే పాటను విడుదల చేసింది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు అనుదీప్‌ దేవ్‌ స్వరాలు సమకూర్చారు. సాయిదేవ వాగ్దేవి, ప్రకృతిరెడ్డి, మయూఖ్‌ ఆలపించారు. ఈ సాంగ్​ చిన్నారులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో హనుమాన్​ను అందరు సూపర్​ హీరోలతో పోలుస్తూ.. రాసిన లిరిక్స్​ నవ్వులు పూయిస్తాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Hanuman Movie Graphics : 'హనుమాన్' చిత్రం సూపర్​ హీరో కథాంశంతో పాన్​ ఇండియా రేంజ్​లో తెరకెక్కుక్కింది. ఇప్పటికే ట్రైలర్​ విడుదలైన ఈ సినిమా టీజర్.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో గ్రాఫిక్స్​ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎంతలా అంటే వందల కోట్ల బడ్జెట్​తో పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ హీరోగా రూపొందిన 'ఆదిపురుష్​' సినిమాతో పోల్చేంతగా. అప్పట్లో ఆదిపురుష్​ గ్రాఫిక్స్​పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో హనుమాన్​ గ్రాఫిక్స్​ వర్క్​తో.. ఆదిపురుష్​ టీమ్ ఇరకాటంలో పడింది. అయితే హాలీవుడ్​ రేంజ్​​లో ఉన్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ విదేశాల్లో చేసింది కాదు. హైదరాబాద్​కు చెందిన 'హేలో హ్యూస్ స్టూడియోస్' అనే సంస్థ ఈ సినిమాకు గ్రాఫిక్స్ అద్దింది. దీంతో ఈ కంపెనీ గురించి టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Hanuman Film Cast : సూపర్ హీరో కాన్సెప్ట్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంజనాద్రి అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

మృణాల్ ఠాకూర్​తో​ డేటింగ్​- క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్​ సింగర్​!

'యానిమల్'​ విత్​ 'లయన్'- అన్​స్టాపబుల్​ సెట్​లో రణ్​బీర్​- షూటింగ్​ కంప్లీట్​!

Last Updated : Nov 14, 2023, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.