Hanuman Movie First Review : హనుమాన్ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాను చూసిన ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తన వన్ వర్డ్ రివ్యూ ఇచ్చేశారు. హనుమాన్ సినిమా ఎంతో బాగుందని, ఫాసినేటింగ్ అంటూ మూడున్నర స్టార్స్ రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమాలో తేజా సజ్జా హీరోగా అదరగొట్టేశారని, గూస్ బంప్స్ మూమెంట్స్ మూవీలో చాలా ఉన్నాయని, వీఎఫ్‌ఎక్స్ అద్భుతంగా ఉందని తెలిపారు. అయితే మొదటి భాగంలో కొన్ని సీన్స్ ల్యాగింగ్‌గా ఉందని పేర్కొన్నారు.
"దర్శకుడు ప్రశాంత్ వర్మ సాలిడ్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. హనుమాన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంది. పురాణాల ఆధారంగా డ్రామా, భావోద్వేగాలు, VFXతో అద్భుతంగా తీర్చిదిద్దారు. గూస్‌బంప్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. క్లైమాక్స్‌ను అసాధారణ రీతిలో అద్భుతంగా ముగించారు. హనుమాన్‌లో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. తేజసజ్జ తన పాత్రకు ప్రాణం పోశారు. వరలక్ష్మి శరత్‌కుమార్ తన మార్క్‌ను చూపించింది. మిగతా నటీనటులు కూడా మంచిగా చేశారు. వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే అద్భుతంగా ఉంది. కథకు తగ్గట్టే సాగింది. ఎక్కడా అస్సలు డామినేట్ చేయలేదు. ప్రధాన పాత్రల డబ్బింగ్ కూడా మంచిగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ కొన్ని సీన్స్ ల్యాగింగ్‌గా ఉన్నాయి." అంటూ రాసుకొచ్చారు.
-
#OneWordReview...#HanuMan: FASCINATING.
— taran adarsh (@taran_adarsh) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Rating: ⭐️⭐️⭐️½
Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd
">#OneWordReview...#HanuMan: FASCINATING.
— taran adarsh (@taran_adarsh) January 11, 2024
Rating: ⭐️⭐️⭐️½
Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd#OneWordReview...#HanuMan: FASCINATING.
— taran adarsh (@taran_adarsh) January 11, 2024
Rating: ⭐️⭐️⭐️½
Director #PrasanthVarma crafts a solid entertainer… #HanuMan is ambitious and exciting - packs drama, emotions, VFX and mythology skilfully… Loaded with goosebump moments + extraordinary finale… Recommended!… pic.twitter.com/7M2RKk2zkd
Hanuman Pre Release Business : 'హనుమాన్' రూ.27.50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకు హిట్ టాక్ వస్తే స్టార్ హీరోల భారీ చిత్రాల(ఈ సంక్రాంతికి రిలీజ్) మధ్య అన్ని కోట్లు రావడం పెద్ద కష్టం ఏమీ కాదని అంచనా వేస్తున్నారు. సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించగా - అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'హనుమాన్' ప్రీమియర్ షోస్ టికెట్స్ - ఊహించని విధంగా మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!
'హనుమాన్' కోసం 'అంజనాద్రి' - ఈ సినిమాలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయంటే ?