Hanuman Movie Collections Worldwide : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం 'హనుమాన్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలై కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అందుకుంది. ఈ విషయాన్ని మూవీటీమ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
సంక్రాంతి బరిలో ఇప్పటికే విడుదలైన అగ్ర హీరోల సినిమాలు 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామి రంగ' లాంటి చిత్రాలను బీట్ చేసి మరీ తక్కువ సమయంలోనే ఇంత భారీ కలెక్షన్స్‌ను 'హనుమాన్' అందుకుంది. అలాగే నార్త్ అమెరికాలో నాలుగు రోజుల్లోనే 3 మిలియన్ల డాలర్లకుపైగా వసూళ్లను సాధించింది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో టాప్ 10లో స్థానం సొంతం చేసుకుంది. దీంతో ఓవర్సీస్(నార్త్ అమెరికాలో) ఇప్పటికే ప్రముఖ సినిమాలు 'సలార్', 'బాహుబలి' పేరిట ఉన్న మొదటి వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసింది.
ప్రశంసల వెల్లువ
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 'హనుమాన్' రూ.100కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ 'రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి సినిమా' అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆడియెన్స్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ తెలిపారు. మరోవైపు సినిమాపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి- తనను అభినందిస్తూ మెసేజ్ పెట్టినట్లు హీరో తేజ సజ్జ ఇటీవల తెలిపారు. తాజాగా హీరో రామ్ పోతినేని కూడా ఈ చిత్రబృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
త్వరలో రూ.300-400 కోట్లు?
సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తక్కువ బడ్జెట్లో రూపొందిన 'హనుమాన్' చిత్రం విడుదలకు సరిపడా థియేటర్లు దొరకనప్పటికీ, సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో అరకొరా స్క్రీన్లతోనే మూవీని విడుదల చేశారు మేకర్స్. అయినప్పటికీ బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రానికి నార్త్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ అద్భుతమైన కలెక్షన్స్ వసూలు అవుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే 'హనుమాన్'కు ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయంటే- ఇక మున్ముందు రూ.300-400 కోట్లు కొల్లగొట్టినా పెద్దగా ఆశ్చర్యానికి గురికానక్కర్లేదేమో.
-
My first century in films 😊🙏🏽 pic.twitter.com/VsiqdttRyR
— Prasanth Varma (@PrasanthVarma) January 16, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">My first century in films 😊🙏🏽 pic.twitter.com/VsiqdttRyR
— Prasanth Varma (@PrasanthVarma) January 16, 2024My first century in films 😊🙏🏽 pic.twitter.com/VsiqdttRyR
— Prasanth Varma (@PrasanthVarma) January 16, 2024