ETV Bharat / entertainment

ఓవ‌ర్‌సీస్‌లో 'హనుమాన్​' మేనియా - ఈ సారి మహేశ్​ రికార్డుల‌ు బ్రేక్! - హనుమాన్ నార్త్ ​అమెరికా కలెక్షన్​

Hanuman Movie Box Office Collection : తేజ సజ్జా లీడ్​ రోల్​లో పాన్ ఇండియా లెవెల్​లో విడుదైన లేటెస్ట్​ మూవీ 'హ‌నుమాన్'. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్​ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంతకీ అదేంటంటే ?

Hanuman Movie Box Office Collection
Hanuman Movie Box Office Collection
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 2:37 PM IST

Hanuman Movie Box Office Collection : చిన్న సినిమాగా విడుదలైన 'హ‌నుమాన్' మూవీ ఇప్పుడు బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్స్​ క్రియేట్​ చేస్తూ సందడి చేస్తోంది. హౌస్ ఫుల్​ బోర్డుల నడుమ మంచి టాక్ అందుకుని మరింత జోరు కనబరుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై వారం రోజులు అవుతోంది. అయితే ఇది క‌లెక్ష‌న్స్ ప‌రంగా అనేక రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. తాజాగా ఓవ‌ర్‌సీస్‌లో ఓ సరికొత్త రికార్డును నమోదు చేసింది. అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన తెలుగు చిత్రాల లిస్ట్​లో తన స్థానాన్ని దక్కించుకుంది. వారంలో ఈ చిత్రం సూమారు 3.5 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్స్ అందుకుంది.

అయితే ఇప్పటికే అక్కడి బాక్సాఫీస్ వద్ద మ‌హేశ్​ బాబు 'భ‌ర‌త్ అనే నేను మూవీ' సుమారు 3.4 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్స్​ సాధించింది. ఇక ఈ సినిమా రికార్డును 'హ‌నుమాన్' వారంలోనే దాటేసింది. మరోవైపు ప్ర‌భాస్ సాహో 3. 23 మిలియ‌న్లు, ఆదిపురుష్ 3.16 మిలియ‌న్ల వ‌సూళ్ల‌ను అందుకోగా, వాటిని కూడా వారంలో 'హ‌నుమాన్' బ్రేక్ చేసింది.

ఇక అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను అందుకున్న సినిమాల లిస్ట్​లో 'బాహుబ‌లి 2' మూవీ టాప్‌ పొజిషన్​లో ఉంది. ఈ చిత్రానికి అక్కడ సుమారు 20.75 మిలియ‌న్ డాల‌ర్లు వచ్చాయి. ఆ త‌ర్వాతి స్థానంలో 14 మిలియ‌న్ల‌ డాలర్లతో 'ఆర్ఆర్ఆర్' సెకండ్ పొజిషన్​లో ఉంది. ఇటీవలే విడుదలైన 'స‌లార్' 8.90 మిలియ‌న్ డాల‌ర్ల‌తో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది.

మరోవైపు 'హ‌నుమాన్' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ కలెక్షన్స్​తో దూసుకెళ్తోంది. ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం ఒక్క నైజాం ఏరియాలోనే ఈ చిత్రం సూమారు రూ. 15 కోట్ల క‌లెక్ష‌న్స్ అందుకుంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా తొలి వారం ఈ సినిమా దాదాపు రూ. 130 కోట్ల వ‌సూళ్ల‌ను అందుకున్నట్లు తెలిసింది. గురువారం రోజు ఈ చిత్రం రూ.9.45 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ఇండియాలో రూ.93 కోట్లు, ఓవ‌ర్‌సీస్‌లో రూ. 37 కోట్ల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుంది.

'హనుమాన్​ 2'పై అంచనాలు పెంచేసిన బాలయ్య! - ఈ వీడియో చూశారా?

'సంస్కృతిని ఎప్పుడూ తప్పుగా చూపించను - వాళ్ల గురించి నేను మాట్లాడను'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.