ETV Bharat / entertainment

రోబోగా మారిన స్టార్ హీరోయిన్​!.. ఫన్నీ ఫన్నీగా ట్రైలర్​.. ఈ వీకెండ్​లోనే స్ట్రీమింగ్ - డిస్నీ హాట్ స్టార్​లో రోబోగా హన్సిక వెబ్​సిరీస్​

Hansika Motwani Upcoming Web Series : హీరోయిన్ హన్సిక కొత్త వెబ్​సిరీస్​ MY3 స్ట్రీమింగ్​కు రెడీ అయింది. ట్రైలర్ ఫన్నీ ఫన్నీగా ఉంది. ఇందులో ఆమె రోబోగా నటించింది.

రోబోగా మారిన స్టార్ హీరోయిన్​!.. ఫన్నీ ఫన్నీగా ట్రైలర్​.. ఈ వీకెండ్​లోనే స్ట్రీమింగ్ షురూ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 5:33 PM IST

Hansika Motwani Upcoming Web Series : సినీ ఇండస్ట్రీలోకి బాల నటిగా కెరీర్ స్టార్ చేసి స్టార్ హీరోయిన్​గా ఎదిగింది గ్లామరస్ బ్యూటీ హన్సిక. హిందీలో 'కోయి మిల్ గయా', 'హవా', 'జాగో', 'హమ్ కౌన్ హై', 'అబ్ర క దబ్ర' వంటి సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో దేశముదురుతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సూపర్​ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. ​ ఈ క్రమంలోనే దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది.

ఆ తర్వాత కొత్త హీరోయిన్లు రావడంతో తెలుగులో ఫేడ్ ఔట్​ అయిన ఈ ముద్దుగుమ్మ.. పక్క భాషల్లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక్క అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తోంది. అయితే ఇప్పటికీ వరుస సినిమాలతో స్పీడును కంటిన్యూ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడామె ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన 'మైత్రీ' వెబ్‌ సిరీస్‌ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రెడీ అయింది. ఓ కొరియన్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఎం.రాజేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 15 నుంచి ప్రసారం కానుంది. సైంటిఫిక్‌ అంశాలతో రూపొందిచారు. ఈ సిరీస్‌లో హన్సికతో పాటు శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్‌ ఇతర కీలకపాత్రల్లో నటించారు.

తాజాగా ఈ సిరీస్​ ట్రైలర్‌ కూడా రిలీజ్ చేశారు. హన్సిక ఇందులో మైత్రి అనే రోబోగా కనిపించింది. అలాగే మరో మహిళా పాత్రలోనూ నటించింది. ఈ ప్రచార చిత్రంలో హన్సిక తన లుక్‌తో, మ్యానరిజంతో ఆకట్టుకుంది. ఓ యువ సైంటిస్ట్‌ చేసిన చిన్న తప్పు కారణంగా రోబో.. మహిళగా మారడం.. ఆ లేడీ రోబోతో కొందరు యువకులు ప్రేమలో పడటం వంటి సన్నివేశాలను చూపించారు. ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగుతో పాటు మరో 6 భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం హన్సిక.. మై నేమ్​ ఈజ్ శ్రుతి, రౌడీ బేబీ, గార్డియన్, గాంధారీ, మాన్​ చిత్రాల్లో నటిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Hansika Motwani Latest Photos : కెమెరాకు హాట్ ఫోజులిచ్చిన దేశముదురు భామ.. కుర్రాకారుకు కిక్​ ఇస్తున్న హన్సిక..

హన్సిక పెళ్లికి నిరుపేద పిల్లలు.. ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.