ETV Bharat / entertainment

'గుంటూరు కారం'లో ఆ స్టార్​ హీరో​.. మహేశ్​ను మించి యాక్టింగ్​.. - jagapati babu in guntur kaaram movie

టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దిగనున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్​ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం సీనియర్​ స్టార్​ తీసుకున్నారట. అయితే ఆయన క్యారెక్టర్​కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం గురించి నెట్టింట చర్చలు జరుగుతోంది. ఇంతకీ అదేంటంటే..

guntur kaaram
guntur kaaram
author img

By

Published : Jul 2, 2023, 6:14 PM IST

Guntur Kaaram Cast : టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్ బాబు మూవీ 'గుంటూరు కారం'లో ఓ కీలక పాత్ర కోసం సీనియర్​ స్టార్​ తీసుకున్నారట. ఆయన మరెవరో కాదు సీనియర్ స్టార్​ హీరో జగపతి బాబు. తన విలక్షణ నటనతో అందరిని అబ్బురపరిచే ఈ స్టార్​ ఇప్పుడు గుంటురు కారంలో ఓ కీ రోల్​ ప్లే చేయనున్నారట. అయితే ఆయన క్యారెక్టర్​ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్​ రూమర్​ గురించి ఇప్పుడు నెట్టింట చర్చలు జరుగుతోంది.

ఈ సినిమాలో జగపతిబాబు ఇగో ఉన్న ఓ విలన్ పాత్రలో కనిపించనున్నారట. సినిమాలో ఆయన ఎదురుగా ఎవరు కూడా అతిగా ప్రవర్తించరట. 'రంగస్థలం' సినిమాలో జగ్గు భాయ్​ ఇంటి ముందు గ్రామ ప్రజలు చెప్పులు తీసేసి ఎలా వెళ్తారో.. ఈ సినిమాలో కూడా ఆయన పైన గౌరవంతోనో, భయం కారణంగానో.. ఆయన ఎదుట సిగరెట్ తాగే ధైర్యం అస్సలు చేయరట. ఒకవేళ అలా ఎవరైన ప్రవర్తిస్తే..ఇక అంతేనట. ఆ పాత్రకు ఉన్న గాంభీర్యం అలాంటిది మరి. కానీ సినిమాలో మహేశ్ బాబు, జగపతిబాబు ముందు ఆయన హీరోయిజం చూపిస్తూ.. తనదైన శైలిలో సిగరెట్ కాలుస్తారంట. దీంతో సినిమాలో ఈ ఇద్దరి మధ్య సెన్సేషనల్ సన్నివేశాలు ఉండడం ఖాయమని మహేశ్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు.

మహేశ్ - త్రివిక్రమ్​..
Mahesh Trivikram Movies : టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ మహేశ్ కాంబినేషన్​లో వస్తున్న గుంటూరు కారం పై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరు 'అతడు', 'ఖలేజా' సినిమాలు చేశారు. అప్పట్లో అతడు సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వగా.. ఖలేజా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినప్పటికీ వీరిద్దరి నుంచి ఖలేజా ఒక మంచి ప్రయత్నంగా భావిస్తారు మహేశ్ ఫ్యాన్స్.

మహేశ్ - జగపతిబాబు..
Mahesh babu Movies : సూపర్​స్టార్ మహేశ్ బాబు, జగపతిబాబులకు సక్సెస్​పుల్ కాంబినేషన్​గా పేరుంది. వీరిద్దరు తండ్రీకుమారులుగా శ్రీమంతుడు సినిమాలో ఫ్యామిలీ ఆడియోన్స్​ను మెుప్పించారు. అనంతరం మహర్షి చిత్రంలో జగ్గు భాయ్ విలన్​గా నటింటారు. కాగా ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్​గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గుంటూరు కారంతో హ్యాట్రిక్ ఖాయమని అంతా భావిస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రాజెక్ట్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్​ తమన్​తో పాటు హీరోయిన్ పూడ హెగ్డెను తొలగించారని కొద్ది రోజుల కింద వార్తలు వచ్చాయి. కాగా రీసెంట్​గా చిత్రబృందం ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది. తమన్‌ను తీసేయలేదని.. ఆయనే ఈ సినిమాకు సంగీత దర్శకుడు అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టం చేశారు. కానీ పూజ గురించి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.