Guntur Kaaram VS Hanuman : ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద నాలుగు స్ట్రెయిట్ సినిమాలతో పాటు మూడు డబ్బింగ్ సినిమాలు పోటీ పడనున్న సంగతి తెలిసిందే. దీంతో ముగ్గుల పండగ బాక్సాఫీస్ పోరు తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తికరంగా మారింది. ఎవరు విన్నర్‌గా నిలుస్తారంటూ ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మహేశ్ బాబు(గుంటూరు కారం), వెంకటేశ్(సైంధవ్), నాగార్జున(నా సామిరంగ) వంటి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా 'హనుమాన్' చిత్రంతో బాక్సాఫీస్ బరిలో నిలిచారు. అయితే జనవరి 12న రానున్న 'గుంటూరు కారం', 'హనుమాన్' చిత్రాల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. మహేశ్ లాంటి స్టార్ హీరోతో యంగ్ హీరో తేజ సజ్జా పోటీ పడటమే ఇందుకు కారణం.
అయితే ఈ సినిమాల విడుదల తేదీ దగ్గర పడే కొద్ది 'హనుమాన్' క్రేజ్ రోజురోజుకూ మరింత పెరిగిపోతోంది. ఓ విషయంలో 'గుంటూరు కారం' కన్నా ఓ అడుగు ముందే నిలిచింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో' ఇంట్రెస్ట్ లిస్ట్‌లో 'హనుమాన్' మూవీ టాప్‌లో కొనసాగుతోంది. 'హనుమాన్' సినిమా చూడటానికి ఎక్కువగా మంది ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టెడ్ లిస్ట్‌లో 'హనుమాన్' సినిమా తాజాగా 228.4K (సుమారు 2 లక్షల 28 వేల మంది) ఆసక్తిని పొందింది. ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్ట్‌లను అందుకుంటూ దూసుకుపోతోంది. దీంతో అత్యధిక ఇంట్రెస్ట్‌లను అందుకున్న సంక్రాంతి చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ (225.7K)ను కూడా క్రాస్ చేసింది. అలా పెద్ద సినిమా 'గుంటూరు కారం'కు ఈ చిత్రం గట్టి పోటినిస్తోంది.
ఇక 'హనుమాన్' చిత్రం విషయానికి వస్తే ఇందులో తేజ సజ్జాతో పాటు అమృత అయ్యర్ లీడ్ రోల్లో నటిస్తోంది. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, సీనియర్ డైరెక్టర్ సముద్రఖని ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడులదైన ట్రైలర్ అభిమానుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంక్రాంతి హీరోల రెమ్యునరేషన్- మహేశ్, వెంకీ, నాగ్, తేజ ఎన్ని రూ.కోట్లు తీసుకున్నారంటే?