Gopichand Srinu Vaitla : మ్యాచో స్టార్ గోపీచంద్ - ఫన్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే నేడు దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా.. హీరో గోపిచంద్ ఆయనకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూవీ టీమ్ కూడా దాన్ని షేర్ చేసింది.
ఈ మూవీ షూటింగ్ సౌత్ ఇటలీలోని మాంటెరాలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ వీడియోలో షూటింట్ చేయనున్న లొకేషన్స్‌ను చూపించారు. ఈ లొకేషన్స్ అమేజింగ్‌గా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే.. సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దబోతున్నట్లు అర్థమైపోతుంది. గోపిచంద్ - శ్రీనువైట్లు కెరీర్లోనే ఈ సినిమా భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చిత్రలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనెపూడి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా ఫస్ట్ క్లాస్ ప్రొడక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా మొత్తం షూటింగ్ అంతా ఫారెన్ లొకేషన్స్‌లోనే చిత్రీకరించనున్నారని తెలిసింది.
ఇకపోతే ఈ చిత్రానికి ప్రముఖ రచయిత గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గతంలో శ్రీను వైట్ల- గోపిమోహన్ కాంబోలో 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను', 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' చిత్రాలు వచ్చాయి. అలాగే గోపీచంద్ నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకు కూడా గోపి మోహన్ వర్క్ చేశారు. 'ఆర్ఎక్స్ 100', 'మన్మథుడు 2', 'వినరో భాగ్యము విష్ణు కథ', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'తో పాటు ఇతర చిత్రాలకు సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ గోపిచంద్-శ్రీనువైట్ల సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చూడాలి మరి వరుస పరాజయాలతో ఉన్న హీరో గోపిచంద్ - దర్శకుడు శ్రీనువైట్ల ఈ సారి ఎలాంటి యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారో, ఈ సినిమా వీరిద్దరికి ఎలాంటి ఫలితాన్ని కట్టబెడుతుందో...
- " class="align-text-top noRightClick twitterSection" data="">