ETV Bharat / entertainment

హీరోస్​ ఎక్స్ఛేంజ్​.. ఈ సారి బాలయ్యతో బాబీ- చిరుతో గోపి! - బాలయ్యతో బాబీ సినిమా

వాల్తేరు వీరయ్య, వీరిసింహా రెడ్డి సక్సెస్ సాధించిన​ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ తమ కొత్త సినిమాలతో బిజీ అయిపోయారు. కానీ ఈ చిత్ర దర్శకులు బాబీ, గోపిచంద్ మలినేని మాత్రం ఇంకా తమ కొత్త ప్రాజెక్ట్​లను ప్రకటించలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ తమ హీరోలను ఎక్స్ఛేంజ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి! చిరుతో గోపిచంద్​, బాలయ్యతో బాబీ చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

Gopichand and Bobby Are Exchanging Heroes Chiranjeevi and Balakrishna
హీరోస్​ ఎక్స్ఛేంజ్​.. ఈ సారి బాలయ్యతో బాబీ- చిరుతో గోపి!
author img

By

Published : Mar 5, 2023, 11:12 AM IST

చిత్రసీమలో ఈ సంక్రాంతి ఎంత ప్రత్యేకంగా నిలిచిందో తెలిసిన విషయమే. ఒకే నిర్మాణ సంస్థ రూపొందించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలకావడం, అందులోనూ అవి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చిత్రాలు కావడం విశేషం. ఈ అగ్రహీరోలిద్దరూ ఒక్క రోజు గ్యాప్​లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్​ను షేక్​ చేశారు. ఇద్దరు కలిసి ప్రేక్షకుల చేత ఈలలు వేయించి.. దాదాపు రూ.350కోట్లకు పైగా వసూలు చేశారు. అయితే ఈ సందడి ముగిసింది దాదాపు నెల రోజులు కావొస్తుంది.

ఇప్పుడు చిరంజీవి, బాలయ్య తమ కొత్త చిత్రాలతో కూడా ఫుల్ బిజీ అయిపోయారు. షూటింగ్​లలో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోస్​కు సూపర్​ హిట్​ ఇచ్చిన డైరెక్టర్స్​ బాబీ(వాల్తేరు), గోపిచంద్ మలినేని(వీరయ్య) మాత్రం ఇంకా తమ కొత్త సినిమాలను ప్రకటించలేదు. అయితే వీరి నుంచి ఎలాంటి సినిమా రానుంది, వీరు ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. ఈ డైరెక్టర్లిద్దరూ ప్రస్తుతం ఫలానా హీరోతో చేయబోతున్నారని కొంతమంది పేర్లు వినిపించాయి. కానీ వీటిపై ఇప్పటివరకు ఓ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన సమాచారం చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ దర్శకులు తమ హీరోలను ఎక్స్ఛేంజ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి! ప్రస్తుతం యంగ్ జనరేషన్​ స్టార్ హీరోలంతా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో మళ్లీ సీనియర్ హీరోలతోనే చేయాలనుకుంటున్నారట. అలా ఈ సారి బాలకృష్ణతో బాబీ, చిరంజీవితో గోపిచంద్​ మలినేని సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్​ కాన్సెప్ట్​తో రావాలని ఆలోచిస్తున్నారట. హీరోలిద్దరితో చర్చలు జరిపించేందుకు ట్రై చేస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్తలు షికార్లు చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

అలాగే ఇక చిరంజీవి కొత్త చిత్రం భోళాశంకర్ విషయానికొస్తే.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో తమన్నా హీరోయిన్​. కీర్తిసురేశ్​.. చిరుకు చెల్లిలిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్​, టీజర్స్​ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో చిరు తన పాత సూపర్​ హిట్​ పాట రీమిక్స్​ చేస్తారని ప్రచారం సాగుతోంది. అలాగే బాలయ్య ప్రస్తుతం.. ఫన్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడితో NBK 108 సినిమా చేస్తున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్​తో రానున్న ఈ చిత్రంలో బాలయ్యకు కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ప్రస్తుతం ఇది కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది! ఒకవేళ బాబీ, గోపిచంద్ ప్రయత్నాలు ఫలిస్తే.. చిరు, బాలయ్య కొత్త చిత్రాలు పూర్తయ్యాకే ఆ దర్శకులతో సినిమా చేసే అవకాశముంది.

ఇదీ చూడండి: సంయుక్త క్రేజ్​.. ఈ ముద్దుగుమ్మ చూపులకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.