ETV Bharat / entertainment

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో 'ఓపెన్‌ హైమర్‌' హవా- RRR గెలిచిన అవార్డు ఈసారి ఎవరికి? - గోల్డెన్ గ్లోబ్ బార్బీ

Golden Globe Awards 2024 Winners : గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో ఓపెన్‌హైమర్‌ మూవీ అదరగొట్టింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు(డ్రామా), సహాయ నటుడు అవార్డులను సొంతం చేసుకుంది. మరి గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన అవార్డు ఈసారి ఎవరు గెలుచుకున్నారో తెలుసా?

Golden Globe Awards 2024 Winners
Golden Globe Awards 2024 Winners
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 9:44 AM IST

Updated : Jan 8, 2024, 10:58 AM IST

Golden Globe Awards 2024 Winners : గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో ఓపెన్‌హైమర్‌ సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు(డ్రామా), సహాయ నటుడు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా సిలియన్‌ మర్ఫీ, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్‌ నోలన్‌కు అవార్డులు దక్కాయి. క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది.

  • ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్‌
  • ఉత్తమ కామెడీ చిత్రం- పూర్‌ థింగ్స్‌
  • ఉత్తమ దర్శకుడు - క్రిస్టఫర్‌ నోలన్‌(ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్‌ సాగ్‌ ట్రైట్‌, ఆర్ధర్‌ హరారి ( అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
  • ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ నటి - లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
  • ఉత్తమ హాస్య నటి - ఎమ్మా స్టోన్ (పూర్‌ థింగ్స్‌)
  • ఉత్తమ హాస్య నటుడు - పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్)
  • ఉత్తమ సహాయనటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్)
  • ఉత్తమ సహాయనటి - డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్)
  • ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ - లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)
  • ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ - వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ (బార్బీ)
  • ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం - ది బాయ్ అండ్ ది హెరాన్
  • బాక్సాఫీస్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు - వార్నర్ బ్రదర్స్(బార్బీ)

అప్పుడు ఆర్ఆర్ఆర్- ఇప్పుడు బార్బీ
2023లో ఆర్ఆర్ఆర్ గెలుచుకున్న ఈ అవార్డును ఈసారి బార్బీ మూవీలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ సాంగ్ గెలుచుకుంది. ఈ సాంగ్ ను రాయడంతోపాటు కంపోజ్ చేసింది బిల్లీ ఐలిష్ ఓకానెల్, ఫినియాస్ ఓకానెల్. ఈ ఇద్దరూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. గతేడాది ఆర్ఆర్ఆర్ బెస్ట్ మోషన్ పిక్చర్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీకి కూడా నామినేట్ అయినా అవార్డు గెలుచుకోలేకపోయింది. నాటు నాటు సాంగ్ కు మాత్రం అవార్డు దక్కింది. ఇదే పాటకు తర్వాత ఆస్కార్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.

బుల్లితెరలో ఎవరికి?
ఇక బుల్లితెర విషయానికి వస్తే హెచ్‌బీవో రూపొందించిన సక్సెషన్ సిరీస్ బెస్ట్ టెలివిజన్ సిరీస్ డ్రామా కేటగిరీలో అవార్డు గెలిచింది. గతేడాది ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన బెస్ట్ మోషన్ పిక్చర్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ కేటగిరీలో ఈసారి అవార్డు అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ (నియోన్) అనే ఫ్రెంచ్ మూవీకి అవార్డు దక్కింది.

Last Updated : Jan 8, 2024, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.