ETV Bharat / entertainment

ఉర్రూతలూగించేలా చిరు- సల్మాన్‌ల 'తార్‌ మార్‌' సాంగ్ - తార్​ మార్​ తక్కర్​ సాంగ్​

చిరంజీవి గాడ్​ఫాదర్​లోని తార్​ మార్​ తక్కర్​ సాంగ్​ విడుదలైంది. ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

god father
గాడ్​ఫాదర్​
author img

By

Published : Sep 21, 2022, 4:16 PM IST

ఎప్పుడెప్పుడా అని చిరంజీవి అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన 'గాడ్‌ ఫాదర్‌' తొలి పాట వచ్చేసింది. 'తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌' అంటూ హుషారుగా సాగే లిరికల్​ వీడియో సాంగ్​ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ పాట శ్రోతలను ఉర్రూతలూగించేలా ఉంది. అగ్ర హీరోలు చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లపై చిత్రీకరించిన గీతమిది. ఇద్దరూ ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ చేసినట్టు వీడియోలోని క్లిప్పింగ్స్‌ చూస్తే తెలుస్తోంది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్‌ పాడారు. తమన్‌ సంగీతం అందించారు.

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రమిది. మలయాళ హిట్‌ సినిమా 'లూసిఫర్‌'కు రీమేక్‌గా రూపొందింది. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. రామ్‌చరణ్‌, ఆర్‌.బి. చౌదరి, ఎన్‌.వి. ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.