ETV Bharat / entertainment

జెనీలియా రీఎంట్రీ ఆ క్యారెక్టర్​తోనే? - జెనీలియా కొత్త సినిమాలు

Genelia reentry: నటి జెనీలియా వెండితెరపై మళ్లీ సందడి చేసేందుకు సిద్ధమైందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. గాలి జనార్దన్‌రెడ్డి కుమారుడు కిరిటీ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ పాత్ర ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో అని తెలుస్తోంది.

Genelia reentry
జెనీలియా రీఎంట్రీ
author img

By

Published : Jun 18, 2022, 7:33 AM IST

Genelia reentry: జెనీలియా పదేళ్ల తర్వాత తెరపై మెరవనుందా? అవుననే అంటున్నాయి కన్నడ సినీ వర్గాలు. గాలి జనార్దన్‌రెడ్డి కుమారుడు కిరిటీ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో పాత్రలో ఆమె మెరవనుంది. ఈ పాత్రకు కథలో ప్రాధాన్యమున్నట్లు చెబుతున్నారు.

తెలుగు-కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ దీనికి స్వరాలిందిస్తున్నారు. కన్నడ ప్రముఖ నటుడు రవిచంద్రన్‌ ఇందులో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాతో పదేళ్ల క్రితం తెలుగు చిత్రం 'నా ఇష్టం' తర్వాత జెనీలియ తెరపై కన్పించినట్లవుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇదీ చూడండి: బాలయ్య-చరణ్​-విజయ్..​ దేనికి జై కొడతారో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.