నా కూతురికి ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేట్ చేయొద్దని సూచిస్తా అని అన్నారు షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్. ఇంటీరియర్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకొని కెరీర్‌లో రాణిస్తున్న ఆమె.. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని సందడి చేశారు. తన స్నేహితులు భావన పాండే, మహీప్ కపూర్‌లతో కలిసి ఆమె పాల్గొన్నారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. "డేటింగ్ విషయంలో మీ కుమార్తె సుహానా ఖాన్‌కు మీరిచ్చే సలహా ఏమిటి?" అని కరణ్ ప్రశ్నించగా.. ఈ సమాధానం చెప్పారు. అనంతరం షారుఖ్‌తో తన ప్రేమకథకు 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే' టైటిల్ పెడతానని ఆమె చెప్పుకొచ్చారు. తమ ప్రేమకథలో గొడవలున్నాయని ఆమె తెలిపారు.
అనంతరం, "ఒకవేళ మీకు ఏదైనా సినిమాలో నటించే అవకాశం వస్తే హీరోగా మీ సరసన ఎవరు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు?" అని మహీప్‌కపూర్‌ను కరణ్ ప్రశ్నించాడు. "హృతిక్‌రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. మా ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంటుందని నమ్ముతున్నా" అని మహీప్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి : న్యూ లుక్‌లో సూపర్ స్టైలిష్‌గా మహేశ్.. గంగూబాయ్‌గా మారిన నిహారిక