Game Changer First Single Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొదలై ఎంతో కాలం గడిచినప్పటికీ.. ఒక పోస్టర్, టైటిల్ తప్ప మరే అప్డేట్ లేదు. అయితే తాజాగా మూవీ లవర్స్‌కు ఊరటనిచ్చేలా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. దీంతో చరణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందో అంటూ ఆతృతగా ఎదురుచూశారు. కానీ ఇప్పుడు వారికి నిరాశే మిగిలింది. దీపావళి పండగ సందర్భంగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన 'జరగండి..' సాంగ్ రిలీజ్ ఇప్పుడు వాయిదా పడింది.
లీక్స్ కారణంగా గతంలో ఈ సాంగ్ చాలా ట్రెండ్ అయ్యింది. దీంతో లీగల్ యాక్షన్ తీసుకున్న మూవీ టీమ్.. వీలైనంత త్వరగా ఈ సాంగ్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఓ కలర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా నెట్టింట అప్లోడ్ చేశారు. దీంతో మెగా అభిమానులు ఈ సాంగ్ కోసం తెగ వెయిట్ చేశారు. అయితే తాజాగా ఈ పాట విడుదల పోస్ట్‌పోన్ అవుతుందన్న రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అది నిజం కాకూడదని కోరుకున్నారు. కానీ అనుకున్నట్లే సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఓ ప్రెస్ రిలీజ్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.
ఆడియో డాక్యుమెంటేషన్‌లో సమస్యలు వచ్చాయని.. ప్రస్తుతానికి రిలీజ్‌ను వాయిదా వేసి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మూవీ టీమ్ వెల్లడించింది. అంతే కాకుండా 'గేమ్ ఛేంజర్' సినిమా అభిమానులని మెప్పిస్తుందని, సినిమా కోసం చాలా మంది కష్టపడి పని చేస్తున్నారని, మీకు బెస్ట్ ఇస్తామని ఆ ప్రెస్ నోట్లో పేర్కొంది. దీంతో మరోసారి రామ్ చరణ్ అభిమానులకు నిరాశ తప్పలేదు.
-
#GameChanger pic.twitter.com/UhrDpTrg9W
— Sri Venkateswara Creations (@SVC_official) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#GameChanger pic.twitter.com/UhrDpTrg9W
— Sri Venkateswara Creations (@SVC_official) November 11, 2023#GameChanger pic.twitter.com/UhrDpTrg9W
— Sri Venkateswara Creations (@SVC_official) November 11, 2023
Dil Raju Game Changer Movie Update : అదేంటి.. ఆ విషయం దిల్ రాజుకు కూడా తెలియదా?