G20 Summit 2023 RRR Movie : 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఇండియా వైడ్‌గానే కాకుండా.. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు, పొలిటీషియన్స్.. ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ప్రశంసల వర్షం కురిపించారు. తనకెంతో నచ్చిన ఇండియన్ మూవీ ఇదేనని అన్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ.. మూవీటీమ్ను మెచ్చుకున్నారు.
"ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నాకు బాగా నచ్చింది. 3 గంటలు నిడివి ఉన్న ఫీచర్ ఫిల్మ్. ఫన్నీ సీన్స్, అద్భుతమైన సీన్స్, సూపర్ డ్యాన్సులు ఈ చిత్రంలో ఉన్నాయి. ఇందులో భారత్‌పై బ్రిటిష్ చేసిన ఆధిపత్యాన్ని చూపిస్తూ విమర్శ చేసినప్పటికీ.. దానిని కూడా ఎంతో అర్థవంతంగా చూపించారు. ఆ సినిమా చూసిన తర్వాత.. నేను ఎవరితో మాట్లాడినా.. ముందుగా నేడు అడిగే ప్రశ్న.. 'మీరు 'ఆర్‌ఆర్‌ఆర్' చూశారా?'. ఈ సినిమాను నేను బాగా ఎంజాయ్ చేశాను. మూవీటీమ్‌కు నా అభినందనలు" అని లూయిజ్ పేర్కొన్నారు.
-
Thank you President of Brezil, @LulaOfficial for your kind words on #RRRMovie.
— RRR Movie (@RRRMovie) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Our entire team is elated with your applause ❤️. pic.twitter.com/dDpMRtZf23
">Thank you President of Brezil, @LulaOfficial for your kind words on #RRRMovie.
— RRR Movie (@RRRMovie) September 10, 2023
Our entire team is elated with your applause ❤️. pic.twitter.com/dDpMRtZf23Thank you President of Brezil, @LulaOfficial for your kind words on #RRRMovie.
— RRR Movie (@RRRMovie) September 10, 2023
Our entire team is elated with your applause ❤️. pic.twitter.com/dDpMRtZf23
RRR Movie Collections : కొమురం భీమ్‌గా ఎన్టీఆర్- అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ఆర్‌ఆర్‌ఆర్. అలియా భట్ సీతగా కనిపించింది. అజయ్‌దేవగణ్-శ్రియా-సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫిక్షనల్ కథతో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఘన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ ముందు సరికొత్త రికార్డులు సృష్టించింది. దాదాపు రూ.1000 కోట్ల వరకు వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్‌కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇంకా మరెన్నో అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.
RRRకు ఏడాది.. ఊహకు అందని అవార్డులు.. లెక్కకు మించిన రివార్డులు!
'నాటు నాటు'కు ఆస్కార్.. భార్య, కొడుకుతో రచ్చ చేసిన రాజమౌళి!