ETV Bharat / entertainment

కొరియన్ లవ్ స్టోరీస్ ఎవరైనా చూస్తారు.. ఈ హార్రర్ చిత్రాలు చూస్తేనే అసలు కిక్!

Horror Suspense Korean Movies : కొరియాలో రూపొందిన హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్​లకు మన దగ్గర కూడా మంచి ఆదరణ ఉంది. వెన్నులో వనుకు తెప్పించేలా ఉండే ఈ సినిమాలను ఇక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఈ క్రమంలో కొరియాలో విడుదలై హిట్​గా నిలిచిన టాప్ కొరియన్​ సినిమాల్లో కొన్ని ఆయా ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..

Horror Suspense Korean Movies
ఓటీటీల్లో కొరియన్ సినిమాలు
author img

By

Published : Aug 1, 2023, 4:52 PM IST

Horror Suspense Korean Movies : ఒకే జానర్​లో వచ్చే సినిమాలు సినీ ప్రియులందరికీ నచ్చుతాయని చెప్పలేము. ఒక్కో వ్యక్తికి ఒక్కో ఫాంటసీ ఉంటుంది. కొందరికి ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ జానర్ సినిమాలు నచ్చితే.. మరికొందరు యాక్షన్ డ్రామా సినిమాలను ఇష్టపడతారు. స్ట్రాంగ్​ లీడ్​ లేకున్నా.. కామెడీ ఉంటే చాలనుకునేవారు కొందరైతే.. హర్రర్​ సస్పెన్స్ సన్నివేశాలు లేనిదే సినిమా ట్రైలర్​ కూడా చూడరు మరికొందరు.

అయితే వెన్నులో వణుకు పుట్టించే హర్రర్​ స్టోరీలకు కొరియన్ సినిమాలు పెట్టింది పేరు. ఇప్పటికే కొరియా నుంచి అనేక సినిమాలు, వెబ్​ సిరీస్​లు విడుదలై.. సూపర్ హిట్​ టాక్​ను సొంతం చేసుకున్నాయి. ఈ కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్​లకు మన దగ్గర కూడా మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ వేదికల్లో అందుబాటులో ఉన్న టాప్ కొరియన్ హర్రర్ సినిమాలేంటో ఓ సారి చూసేద్దామా..

1. ది వెయిలింగ్ (2016)
The Wailing : ఒకానొక గ్రామంలోకి ఓ తెలియని వ్యక్తి ప్రవేశిస్తాడు. అయితే అతని రాకతో అక్కడ తెలియని రోగం వ్యాపించి వరుస మరణాలు సంభవిస్తాయి. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఓ పోలీస్ అధికారి.. ఈ మిస్టరీని ఛేదించేందుకు ముందుకొస్తాడు. ఇంతకీ ఆయన ఆ రహస్యాన్ని ఛేదిస్తాడా లేదా అనేదే 'ది వెయిలింగ్' స్టోరీ. ఈ సినిమా 2016లో విడుదలైంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

2. ది హోస్ట్ (2006)
The Host : రాక్షస మృగం ఓ యువతిని కిడ్నాప్​ చేస్తుంది. ఆ యువతిని కాపాడుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నమే 'ది హోస్ట్'. కుటుంబ విలువలు, బంధాలు, బంధుత్వాల నేపథ్యంలో సాగుతూ.. నవ్విస్తూ, భయపెడుతుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ఎమ్​ఎక్స్ ప్లేయర్​లో అందుబాటులో ఉంది.

3. ఐ సా ది డెవిల్ (2010)
I Saw The Devil : తన భార్యను అతి కిరాతకంగా హత్యచేసిన ఓ సైకో కిల్లర్​పై ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

4. ది సైలెన్స్​డ్ (2015)
The Silenced : అనారోగ్యంగా ఉన్న ఓ అమ్మాయి.. బాలికలల హాస్టల్​లో చేరుతుంది. అక్కడ ఉపాధ్యాయులు చికిత్స చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తారు. కానీ నమ్మశక్యం కాని రీతిలో శరీరం మార్పు చెందడం ఆమె గమనిస్తుంది. అంతేకాకుండా హాస్టల్​లోని అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండాపోతారు. అయితే వారిని కనుగొనేందుకు బాలిక రహస్యంగా చేసిన ప్రయత్నమే.. దిసైలెన్స్​డ్ సినిమా. కాగా ఈ చిత్రం నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతుంది.

5. ది టనెల్ (2016)
Tunnel : కూలిన ఓ సొరంగం కింద ఒక వ్యక్తి నిస్సహాస్థితిలో ఉంటాడు. అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నిస్తారు. కాగా సస్పెన్, సర్వైవల్​ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

6. ది కాల్ (2020)
The Call : 2019లో ఉన్న అమ్మాయి.. 1999 టైమ్​లైన్​లో ఉండే అపరిచిత వ్యక్తికి ఫోన్​ కాల్​ ద్వారా కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయిన తర్వాత వారి, జీవితాల్లో వచ్చిన మార్పులేంటి అనేది కథ. సస్పెన్స్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా.. ఆఖరి 30 నిమిషాలు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతుంది. కాగా ఈ సినిమా నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.