ETV Bharat / entertainment

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. ఈ కాంబోలు అసలు ఊహించనివి! - విజయ్‌ దేవరకొండ పూరి జగన్నాథ్‌ కాంబో

సినీ ఇండస్ట్రీలో ఎవరు ఏ జట్టులో చేరుతారో.. ఏ కలయికలో సినిమా పట్టాలెక్కుతుందో మనం తుది వరకు ఊహించలేం. అంతే కాకుండా ఏ కథ ఎవరి కోసం సిద్ధమవుతుందో అనే విషయం నుంచి అందులో ఎవరు నటిస్తారన్న విషయం వరకు మనం దేనిపై ఓ అంచనాకు రాలేం. చిత్ర విచిత్రాలకి నెలవైన ఈ చిత్రసీమలో ఊహించిన వాటికంటే అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామాలే ఎక్కువ. ఇదే క్రమంలో అంతే అనూహ్యంగా కలయికలు కూడా మారిపోతుంటాయి. ఓ హీరోతో అనుకున్న కథలోకి మరో హీరో ఎంట్రీ ఇస్తుంటాడు. ఓ కథానాయకుడితో కలిసి సినిమా చేయాలనుకున్న దర్శకుడు... మారిన పరిణామాలతో మరో హీరో కోసం ఆ కథను ఓకే చేసిన సందర్భాలు సైతం మనం చూస్తున్నాం. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హవా నడుస్తోంది.

these hero director combos in telugu fim industry are unexpected

author img

By

Published : Apr 25, 2023, 7:26 AM IST

స్టార్‌ హీరోల సినిమాలంటేనే బోలెడన్ని లెక్కలతో కూడుకున్న పని. ఇమేజ్‌... మార్కెటింగ్​ స్ట్రాటజీ... అభిమానులు... నిర్మాతలతో ఉన్న ఒప్పందాలు... ఇలా ఒకటా రెండా.. ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు అడుగులేయాల్సి ఉంటుంది. అన్నీ కుదిరితేనే సినిమా పట్టాలెక్కుతుంది. లేకుంటే ఒక్క విషయం దగ్గర తేడా వచ్చినా కూడా అనుకున్న కలయికలో సినిమా సెట్స్​ పైకి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకేనేమో మొదట కొన్ని కొన్ని కలయికలు ప్రచారంలోకి వచ్చినా... వాళ్లు ఆ సినిమా కోసం కొంత దూరం ప్రయాణం చేసినా సరే... అనూహ్యంగా ఆ కలయికలు మారిపోతుంటాయి. అదే ప్రాజెక్ట్​ కోసం ఎవరూ ఊహించని మరో కొత్త కలయికతో కుదురుతూ ఉంటుంది. గడిచిన రెండు మూడేళ్లలో ఇలాంటి అనూహ్యమైన కలయికలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చిరు తార్​ మార్..
టాలీవుడ్​లోకి మెగాస్టార్​ చిరంజీవి రీ ఎంట్రీతో ఇండస్ట్రీలోని సీనియర్ డైరెక్టర్స్​ నుంచి జూనియర్స్​ వరకూ అందరూ ఆయన కోసం కథలు సిద్ధం చేస్తున్న వారే. అయితే ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలకు దర్శకత్వం వహించింది మాత్రం యువ దర్శకులే. అయితే ఆయన రీ ఎంట్రీ సమయంలో.. చిరు - పూరి జగన్నాథ్‌ కలయికలో ఓ సినిమా ప్రచారంలోకి వచ్చింది. 'ఆటోజానీ' అనే టైటిల్​తో ఓ కథ కూడా సిద్ధమైంది. కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ ప్రాజెక్ట్‌ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. దీంతో ఆ స్క్రిప్ట్‌ పక్కన పెట్టి దర్శకుడు పూరి జగన్నాథ్‌ వేరే హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టారు.

  • 'గాడ్‌ఫాదర్‌' సినిమా స్క్రిప్ట్‌పై సీనియర్‌ దర్శకుడు వి.వి.వినాయక్‌ కొన్నాళ్లు పనిచేశారు. అయితే అనూహ్యంగా ఆయన స్థానంలోకి మోహన్‌రాజా వచ్చి సినిమాని ఈ సినిమాను పట్టాలెక్కించారు.
  • చిరంజీవి - సుజీత్‌ కలయికలోనూ ఓ సినిమా కోసం కొంత కాలం పనులు సాగాయి. అయితే ఆ ప్రాజెక్ట్‌ కూడా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు సుజీత్‌... పవన్‌కల్యాణ్‌తో 'ఓజీ' చేస్తున్నారు.
  • కొన్నాళ్ల కిందట చిరు- వెంకీ కుడుముల కాంబోలో ఓ సినిమా కుదిరినా.. ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వెంకీ కుడుముల... నితిన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలన్నీ స్క్రిప్టింగ్​ దశలోనూ... పూర్వ నిర్మాణ పనుల దశలోనూ.. ఇలా ఒకొక్క సినిమా ఒక్కో కారణంతో ఆగిపోతుంటుంది. మళ్లీ కొత్త బృందాలు ఈ సినిమాల కోసం రంగంలోకి దిగి వాటి కోసం కసరత్తులు మొదలుపెడుతుంటాయి.

'ఆర్‌ఆర్‌ఆర్‌' స్టార్స్​కు కూడా..
మెగా పవర్​ స్టార్​ రామ్‌చరణ్‌, జూనియర్​ ఎన్టీఆర్‌ల విషయంలోనూ ఇదే జరిగింది. కొన్నేళ్ల కిందట రామ్‌చరణ్‌ - కొరటాల శివ కలయికలో ఓ సినిమా కుదిరింది. కానీ అప్పట్లో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. అయితే 'ఆచార్య'తో ఈ కాంబో కుదిరింది.

  • మరోవైపు రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు సానా కాంబో అయితే మాత్రం ఎవ్వరూ ఊహించనిది. మొదట ఎన్టీఆర్‌ - బుచ్చిబాబు కలయికలో ఓ సినిమా పక్కా అయ్యింది. కానీ ఎన్టీఆర్‌ చేయాల్సిన ప్రాజెక్టుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల... బుచ్చిబాబు తన కథని రామ్‌చరణ్‌కి ఆ కథ వినిపించడంతో ఆయన పచ్చజెండా ఊపారు. దీంతో ఇప్పుడు ఈ కలయికలో ఓ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
  • ఇదిలా ఉండగా..'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కలయికలో ఓ సినిమా అనుకున్నారట. అయితే ఆ స్థానంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబోలో 'ఎన్టీఆర్​ 30' మొదలైంది. మరోవైపు త్రివిక్రమ్‌... మహేశ్‌బాబుతో 'SSMB 28' చేస్తున్నారు.
  • ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్‌ కూడా ఇదివరకు కొరటాల శివ డైరెక్షన్​లో ఓ సినిమా చేయాలనుకున్నారు. అంతే కాకుండా ఆ ప్రాజెక్ట్‌ని అప్పట్లో ప్రకటించారు కూడా. కానీ అల్లు అర్జున్‌ మాత్రం 'పుష్ప' కొనసాగింపుపైనే దృష్టి పెట్టారు.

ఇలా మారే చిత్రాలు చాలానే!
స్టార్​ హీరో విక్టరీ వెంకటేశ్ విషయంలోనూ ఇలానే జరిగింది. తన 75వ సినిమాకి సంబంధించి పూరి జగన్నాథ్‌ మొదలుకొని... తరుణ్‌ భాస్కర్‌ వరకూ ఇలా ఎంతో మంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ ఆయనతో సినిమా చేసే ఛాన్స్​ను మాత్రం యువ దర్శకుడు శైలేష్‌ కొలను సొంతం చేసుకున్నారు. ఇక ఈ కలయికలోనే ఇప్పుడు 'సైంధవ్‌' సినిమా రూపొందుతోంది.ఇలా తార్‌మార్‌ తక్కెడమార్‌ అనిపించిన ప్రాజెక్టులు చిత్రసీమలో చాలానే ఉన్నాయి.

  • మరోవైపు 'లైగర్‌' తర్వాత రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కాంబోలో 'జనగణమన' చేయాలనుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా చిత్రీకరణ కూడా కొంత మేర జరిగింది. అయితే 'లైగర్‌' పరాజయంతో ఆ ప్రభావం 'జనగణమన'పై పడింది. ఆదిలోనే ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది.
  • విజయ్‌తో ఇప్పుడు యంగ్​ డైరెక్టర్​ గౌతమ్‌ తిన్ననూరి ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతకుముందు గౌతమ్‌ తిన్ననూరి... రామ్‌చరణ్‌కి ఓ కథ వినిపించారు. కానీ ఆ కలయికలో సినిమా కుదరలేదు.
  • నితిన్‌ కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో అనుకున్న సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ స్థానంలో కృష్ణచైతన్య ఇప్పుడు విశ్వక్‌సేన్‌తో ఓ సినిమా చేస్తున్నారు.
  • శర్వానంద్‌ - కృష్ణచైతన్య కలయిక కూడా ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. ఇప్పుడు శర్వానంద్‌ - శ్రీరామ్‌ ఆదిత్య కలయికలో ఓ సినిమా పట్టాలెక్కింది.
  • వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా సాగర్‌ కె.చంద్ర ఓ సినిమా కోసం పని చేయాలనుకున్నారు. అయితే కానీ ఆ స్థానంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా సాగర్‌ కె.చంద్ర సినిమా ఇప్పుడు పట్టాలెక్కుతోంది. దీంతో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లే వరకూ దర్శకుడు ఎవరో, హీరో ఎవరో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.