ETV Bharat / entertainment

Thalaivar 170 : ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్లు.. ఫ్యాన్స్​కు పండగే! - తలైవర్ 170లో మంజు వారియర్

Thalaivar 170 Cast : 'జైలర్' సినిమా రిలీజ్​కు ముందు రజనీ ఫ్యాన్స్​కు ఓ స్వీట్​ సర్​ప్రైజ్​ అందింది. తలైవా 170వ సినిమాలో అమితాబ్​ బచ్చన్​తో పాటు మరికొందరు పాన్​ ఇండియా స్టార్స్​ నటించనున్నారంట. వారెవరంటే ?

thalaivar 170 cast
thalaivar 170
author img

By

Published : Aug 4, 2023, 4:33 PM IST

Thalaivar 170 Latest Update : తమిళ సూపర్​ స్టార్​ రజనీకాంత్​.. ప్రస్తుతం డైరెక్టర్​ నెల్సన్​ దిలీప్​ కుమార్ దర్వకత్వంలో​ నటించిన సినిమా 'జైలర్​'. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలోకి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్​.. అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఇంకా ఈ సినిమా రిలీజ్​ కాకముందే తలైవర్​ 170కు సంబంధించిన ఓ అప్డేట్​ ఇప్పుడు రజనీ ఫ్యాన్స్​లో ఆనందాన్ని నింపుతోంది.

Thalaivar 170 Stars: 'జై భీమ్‌' ఫేమ్​ డైరెక్టర్​ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు నెట్టింట ఓ వార్త తెగ హల్​చల్​ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్​ స్టార్​ అమితాబ్ బచ్చన్ నటించనుండగా.. ఇప్పుడు ఈ లిస్ట్​లో మలయాళ స్టార్స్​ ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్​తో పాటు నేచురల్ స్టార్​ నాని కూడా కీలకపాత్రల్లో నటించబోతున్నారట. అంతే కాకుండా ఈ సినిమాలో నాని పాత్ర 20 నిమిషాల నిడివి ఉండనుందంటూ ఓ బజ్​ కూడా క్రియేట్​ అయ్యింది. ఈ విషయం గురంచి అధికారికంగా ప్రకటన రానప్పటికీ... సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన మరిన్ని వివరాలు మరో రెండు వారాల్లో తెలియనుందని సమాచారం.

Thalaivar 170 Story : ఈ వార్త విన్న ఫ్యాన్స్​ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. అంత మంది స్టార్స్​ను ఒకే స్క్రీన్​పై చూస్తే ఆ ఫీలే వేరు అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాకుండా ఈ సినిమాలో రజినీకాంత్‌ను జ్ఞానవేల్​ ఎలాంటి పాత్రలో చూపించనున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ అంటూ ఓ కథ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దశాబ్దాల క్రితం దేశంలో సంచలనం రేపిన ఓ ఎన్‌కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరో బజ్​ ప్రకారం ఈ సినిమాలో రజనీ ఓ పోలీస్ క్యారెక్టర్​లో కనిపించనున్నారట. సెప్టెంబరు నుంచి షూటింగ్ ప్రారంభించనున్న ఈ సినిమా 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.

Rajnikanth Upcoming Movies : ఇక రజనీకాంత్ లైనప్​ను చూస్తే.. జైలర్ షూటింగ్​ కంప్లీట్​ చేసిన ఆయన తన తదుపరి సినిమాల చిత్రీకరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జైలర్​​తో పాటు తన కూమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' షూట్​ను కంప్లీట్​ చేశారు. విష్ణు విశాల్ లీడ్​ రోల్​లో కనిపించిన ఈ సినిమాలో మొయిద్దీన్ భాయ్‍ అనే కీలక పాత్ర పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.