ETV Bharat / entertainment

సాయిపల్లవి మేనత్త స్టార్​ డైరెక్టర్​కు తల్లి అని తెలుసా!? - ఫిదా సినిమా తరుణ్​భాస్కర్ తల్లి

'ఫిదా' సినిమాలో సాయిపల్లవికి మేనత్తగా నటించిన ఆమె.. ఓ ప్రముఖ డైరెక్టర్​కు తల్లి అని మీకు తెలుసా? తెలియకపోతే ఆమె ఎవరు, ఆ దర్శకుడు ఎవరో ఈ స్టోరి చదివి తెలుసుకోండి..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 2, 2022, 1:26 PM IST

Updated : Oct 2, 2022, 2:37 PM IST

సున్నితమైన ప్రేమకథలతో ఇటు యువతరంతో పాటు అటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తీయడంలో దర్శకుడు శేఖర్‌ కమ్ములది అందెవేసిన చేయి. ఆయన చిత్రాలన్నీ మంచి కాఫీలా మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. జ్ఞాపకాల ఊసుల్లో హాయిగా ఊరేగిస్తుంటాయి. అయితే ఆయన డైరెక్షన్​ చేసిన సినిమాల్లో ఫిదా ఎంతటి విజయం సాధించిందో తెలిసిన విషయమే. సాయిపల్లవి, వరుణ్​తేజ్​ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.

ఇక విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులందరికీ గుర్తుండిపోతాయి. ఎందుకంటే ప్రతి పాత్ర అంతలా ఆడియెన్స్​ మదిని తాకాయి. అయితే సాయి పల్లవి అత్త క్యారెక్టర్​లో చేసిన ఆమె ఎవరో మీకు తెలుసా.. ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్​గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ అమ్మ. ఈమె పేరు గీత భాస్కర్​. ఈ సినిమాలో ఆమె చాలా నేచురల్​గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా నటించి మెప్పించారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన అన్న పెళ్లి కోసం ఓ గ్రామానికి వచ్చిన హీరో(వరుణ్​తేజ్​).. పెళ్లికూతురు చెల్లిని(సాయిపల్లవి) చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమెను ఎలా మెప్పించాడు, ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడు అనేదే కథ. కథ ఎంతో సింపుల్​గా ఉన్నా.. కానీ అందులో లవ్ ఎమోషన్స్​ను చాలా అద్భుతంగా చూపించారు శేఖర్ కమ్ముల. ముఖ్యంగా సాయిపల్లవి యాక్టింగ్, డ్యాన్స్​, తెలంగాణ యాసలో డైలాగ్స్​.. ప్రేక్షకుల్ని ఫిదా చేశాయి.

Fidaa movie
తరుణ్​భాస్కర్​ తల్లి గీతా భాస్కర్​

ఇదీ చూడండి: మా తాత నేను పనికిరానని అనుకున్నారు.. కానీ ఈరోజు..: అల్లు అర్జున్‌

Last Updated : Oct 2, 2022, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.