ETV Bharat / entertainment

'నేను కోరుకున్న జీవితం ఇది కాదు'.. ప్రత్యూష సూసైడ్​ నోట్​లో ఆసక్తికర విషయాలు - ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష

Suspected death
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్
author img

By

Published : Jun 11, 2022, 5:51 PM IST

Updated : Jun 11, 2022, 8:41 PM IST

17:48 June 11

Suspected death: స్నానాల గదిలో ప్రత్యూష మృతదేహం లభ్యం

Suspected death: హైదరాబాద్​లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్నానాల గదిలో ప్రత్యూష మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో ఆమె నివాసముంటోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్ లేఖ లభ్యం: ఆత్మహత్యకు ముందు లేఖ ప్రత్యూష రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను కోరుకున్న జీవితం ఇది కాదని ఆమె లేఖలో రాసినట్లు వెల్లడించారు. ఒంటరి జీవితంతో విరక్తి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు. తల్లిదండ్రులకు భారం కాలేనని లేఖలో వాపోయింది. తనను క్షమించాలని ఆత్మహత్య లేఖలో ప్రత్యూష పేర్కొంది.

ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గదిలో కార్బన్ మోనాక్సైడ్‌ బాటిల్‌ను పోలీసులు గుర్తించారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ప్రత్యూష ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నానాల గదిలో కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చలనచిత్ర రంగంలో ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రత్యూష పనిచేసింది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖులకు ఫ్యాషన్​ డిజైనర్​గా..: మృతురాలు ప్రత్యూష ప్రముఖ తారలైన జాక్వెలిన్, పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్, కాజోల్ దేవగన్, విద్యా బాలన్, రవీనా టాండన్, నేహా దూపియా, శ్రుతి హాసన్, క్రీడాకారిణి సానియా మీర్జా, హీరోయిన్లు హుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్, జుహీ చావ్లా, కృతి కర్బందాతో పాటు చాలా మంది తారలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది. అమెకు బంజారాహిల్స్‌లో బోటిక్ ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో వాచ్‌మెన్‌: నిన్న మధ్యాహ్నం నుంచి ప్రత్యూష ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో ఇవాళ లోపలికి వెళ్లి చూశామని వాచ్‌మెన్‌ చెబుతున్నాడు. ప్రస్తుతం వాచ్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ కావడంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదని, వృత్తి పరంగా ఏమైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ప్రత్యూష ఇంటికి ఎవరెవరు వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 11, 2022, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.