ETV Bharat / entertainment

'నాయకుడు'లో హీరో కన్నా 'విలన్​'కే ప్రేక్షకుల జేజేలు.. అంతలా కనెక్ట్​ అవ్వడానికి కారణాలేంటి? - విలన్​ క్యారెక్టర్​గా ఫహాద్‌ ఫాజిల్‌

Fahadh Faasil in Nayakudu : సినిమాల్లో హీరో క్యారెక్టర్​ కంటే విలన్​ క్యారెక్టర్​కు ప్రేక్షకాదరణ రావడం అరుదు. కరుడుగట్టిన విలన్స్​ను తిట్టిపోసిన ఆడియెన్స్​నే మనం చాలావరకు చూసుంటాం. కానీ అలాంటి క్యారెక్టర్​ చేసి కూడా ఫ్యాన్స్​లో మంచి క్రేజ్​ సంపాదించుకున్నారు నటుడు ఫహాద్‌ ఫాజిల్‌​. తాజాగా విడుదలైన నాయకుడు సినిమాలో 'రత్నవేలు'గా కనిపించిన ఆయన తనదైన శైలిలో విలనిజం పండించి తమిళంలో పాటు తెలుగులోనూ ఆడియెన్స్​ చేత ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇలా ఈయన క్యారెక్టర్​ను కొనియాడటానికి గల కారణం ఏంటంటే?

Fahadh Faasil in Nayakudu
Fahadh Faasil in Nayakudu
author img

By

Published : Aug 4, 2023, 2:39 PM IST

Fahadh Faasil in Nayakudu : తమిళంలో విడుదలై అనూహ్య విజయాన్ని అందుకుంది 'మామన్నన్'​ సినిమా. తెలుగులో ఇదే సినిమాను 'నాయకుడు'గా తెరకెక్కించారు. వడివేలు, ఉదయనిధి స్టాలిన్​, కీర్తి సురేశ్​, ఫహాద్‌ ఫాజిల్‌, లాంటి స్టార్స్​ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అయితే ఇందులో హీరో క్యారెక్టర్​ కంటే విలన్​ క్యారెక్టర్​కే అక్కడి ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. హీరో​తో పాటు అతడి తండ్రి క్యారెక్టర్​ హైలైట్​ అవ్వాల్సిన ప్లేస్​లో విలన్​ క్యారెక్టర్​కు ప్రేక్షకాదరణ లభించింది. దీనికి కారణం ఆ క్యారెక్టర్​ను అంతలా లీనమై పోషించిన వ్యక్తి. ఆయనే మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​.

తమిళంతో పాటు మలయాళంలోనూ ఎన్నో సినిమాల్లో తన విలక్షణ నటనతో ప్రేక్షకలను కట్టిపడేసిన ఆయన ఈ సినిమాలోనూ తన నటవిశ్వరూపాన్ని చూపించి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి పేరు పొందారు. రత్నవేలు గౌండర్​గా కనిపించిన ఆయన తనదైన శైలిలో విలనిజం పండించి ఇప్పటి వరకు తమిళ ఇండస్ట్రీలో విలక్షణ విలన్స్​గా పేరొందిన స్టార్స్​ జాబితాలోకి చేరిపోయారు.

Nayakudu Movie Cast : మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ 'మామన్నన్‌' ఆడియెన్స్​ నుంచి మంచి ఆదరణ పొందింది. కథతో పాటు సినిమాలోని పాత్రల నటన మనసుకు హత్తుకునేలా ఉందటం వల్ల ఈ సినిమాకు అందరూ బాగా కనెక్టయ్యారు. యువ రాజకీయ నాయకుడు రత్నవేలుగా ఫహాద్‌ ఫాజిల్‌ జీవించారు. ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా, తాను అనుకున్నది సాధించే మొండివాడిగా ఆయన నటన, హావభావాలు కట్టిపడేస్తాయి. మొదట్లో క్రూరుడిగా, బలమైన వ్యక్తిగా ఆ పాత్రను చూపించినా, సెకెండ్​ హాఫ్​ వచ్చేసరికి బలహీన పడిపోయింది. అయినప్పటికీ తన నటనతో రెండింటినీ బ్యాలెన్స్​ చేశారు. దీంతో నెట్టింట ఎక్కడ చూసిన ఆయన పాత్ర గురించి టాక్​. సినిమాలో ఫహాద్​ నటించిన పలు సీన్స్​ను మీమ్స్​, రీల్స్​ రూపంలో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Famous Villian Characters In Tamil Industry : సాధారణంగా కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్​ కంటే విలన్​ క్యారెక్టరే పవర్​ఫుల్​గా ఉంటుంది. మనం ఇప్పటి వరకు చూసిన కథల్లో విలన్​ను కరుడుగట్టిన వాడిలా చూపించడం మామూలే. దీంతో స్క్రీన్​పై విలన్ కనిపించిన ప్రతిసారి అభిమానులు ఆ క్యారెక్టర్​ను తిట్టిపోసుకుంటారు. కానీ 'నాయకుడు' సినిమాలో అలా జరగలేదు. ఫ్యాన్స్ ఈ సినిమాలో హీరో కంటే విలన్​ రత్నవేలు క్యారెక్టర్​కే బాగా కనెక్టయ్యారు. సినిమాకు నిజమైన హీరో అతనే అంటూ కొనియాడుతున్నారు. తమిళ సినిమాల్లో ఇలా హీరో క్యారెక్టర్​ కంటే విలన్​లకు బ్రహ్మరథం పట్టడం ఇదేం తొలిసారి కాదు. దశాబ్దాలుగా అక్కడి ఇండస్ట్రీలో ఇటువంటి విలక్షణ విలన్ క్యారెక్టర్స్​ ఎన్నో ప్రేక్షకాదరణ పొందినవే.

ఒక్కప్పటి కాలంలో తమిళంలో కరుడుకట్టిన విలన్ క్యారెక్టర్లకు నంబియార్ పెట్టింది పేరు. పాత్ర ఏదైనా సరే తనదైన శైలిలో నటించి ఒదిగిపోయే ఆయన.. విలనిజం కూడా ఓ రేంజ్​లో పండించేవారు. అలా అప్పట్లోనే హీరో ఎంజీయార్​తో సమంగా ఫ్యాన్స్​ ఫాలోయింగ్​ సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత శ్రీదేవి, కమల్​హాసన్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన '16 వయధినిలే' సినిమాలో విలన్‌గా నటించిన రజనీకాంత్‌ ఊహించని స్థాయిలో క్రేజ్​ పొందారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో విలన్​ క్యారెక్టర్స్​లో నటించారు. అయితే '16 వయధినిలే'లోని విలన్​ క్యారెక్టర్​కు వచ్చిన ప్రేక్షకాదరణ మరిదేనికి రాలేదు. అప్పట్లో సోషల్‌ మీడియా ఉండుంటే.. "ఇదు ఎప్పిడి ఇరుకు" అనే రజనీ ఫేమస్ డైలాగ్​ ట్రెండ్ అయ్యి ఉంటుందన్న విషయంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

ఇక రజనీకాంత్​ తర్వాత ఆ రేంజ్​లో విలనిజం పండించి పేరొందిన వారిలో నటుడు సత్యరాజ్​ ఒక్కరు. బాహుబలి కట్టప్పగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన.. తమిళంలో ఓ హీరోగా, ఓ క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా, ఓ విలన్​గా తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు. లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన కాకిచట్టై అనే తమిళ సినిమాలో సత్యరాజ్​ విలన్​ క్యారెక్టర్​లో నటించి నయా ట్రెండ్​ సృష్టించారు. ఇక అమైథి పాడై అనే సినిమాలో సత్యరాజ్​ చేసిన విలన్​ క్యారెక్టర్​ గురించి ఎంత చెప్పిన చాలదు. ఆయన నటనతో విలనిజానికి కొత్త నిర్వచనం అందించారు

  • Fahad fazil కోసం 2 సార్లు చూశాను.
    I watched Telugu version, 2 times , exclusively for his acting.

    — B SIVA SANKAR REDDY (@bsivasankarredd) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక ఆ తర్వాత ఇప్పుడు ఫహాద్​ ఫాజిల్​ నటించిన రత్నవేలు క్యారెక్టర్​ తమిళ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతోంది. ఇలా ఒక్క విలన్​ క్యారెక్టర్​కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రేక్షకులకు దశాబ్దాల కాలం పట్టింది. ఎందుకంటే అలా హీరోలను డామినేట్​ చేసి ప్రేక్షకాదరణ పొందిన విలన్​ క్యారెక్టర్స్​ సినిమాల్లో అరుదు. దీంతో ఇప్పుడు ఇలా హీరోల కంటే విలన్స్​కే ఎక్కువ ప్రాధ్యానత ఇవ్వడం సరైనదా కాదా అనేది రానున్న తరాల వరకు వేచి చూడాల్సిందే అనేది విశ్లేషకుల అభిప్రాయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.