ETV Bharat / entertainment

F3 Movie: సెకండ్‌ హాఫ్‌లో గ్రూప్‌ కామెడీ.. నవ్వులే నవ్వులు: సునీల్​ - venkatesh new movie 2022

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన 'ఎఫ్‌3' సినిమా గురించి సునీల్‌ ఆసక్తికర విషయాలను చెప్పారు. సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ​కాసేపు మీడియాతో ఆయన ముచ్చటించారు.

sunil
సునీల్‌
author img

By

Published : May 14, 2022, 10:51 PM IST

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'ఎఫ్‌3'. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్‌ కథానాయికలుగా అలరించనున్నారు. మే27న థియేటర్లలో నవ్వులు పూయించేందుకు సిద్ధమైన ఈ సినిమాలో సునీల్‌ కీలకపాత్ర పోషించారు. 'ఎఫ్‌3' ప్రమోషన్స్‌లో భాగంగా సునీల్‌ కాసేపు మీడియాతో ముచ్చటించారు. సునీల్‌ చెప్పిన ఫన్‌ బ్లాస్ట్‌ ముచ్చట్లేంటో చూద్దాం..

సినిమాల్లోకి వచ్చి 25 ఏళ్లు అవుతోంది కదా.. ప్రయాణం ఎలా ఉంది?

సునీల్‌: మొదట కమెడియన్‌గా సినీరంగ ప్రవేశం చేసిన నేను తర్వాత సిక్స్‌ ప్యాక్‌ చేశాను. హీరోగా, విలన్‌గా నటించాను. నా ప్రయాణం ఇంత విలక్షణంగా సాగింది అంటే దానికి కారణం ప్రేక్షకులు ఆదరించడమే. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నటన అనేది ఓ మహాసముద్రంలాంటిది. నేను సంపూర్ణ నటుడు అయ్యాను అని ఎప్పటికీ అనుకోను. కానీ, విలక్షణ పాత్రలు చేసే అవకాశం వచ్చింది అని మాత్రం చెబుతాను. కామెడీ చేయమన్నా చేస్తా. పదహారేళ్ల అమ్మాయికి తండ్రిగా నటించమన్నా చేస్తా. వచ్చిన అవకాశానికి న్యాయం చేయడానికి వంద శాతం కష్టపడతాను.ఐతే నా వరకు కామెడీ చేసి నవ్వించడమే ఇష్టం.

'ఎఫ్‌3'లో ఆఫర్‌ ఎలా వచ్చింది?

సునీల్‌: 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు అనిల్‌ రావిపూడితో 'కామెడీ చేసే వాళ్లు తగ్గిపోయారు. మనం కలిసి ఒక సినిమా తీయాలి' అని చెప్పాను. సరే అన్నారు. తర్వాత ఎఫ్‌3లో మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో కొత్త సునీల్‌ను చూస్తారు.

'ఎఫ్‌3'లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

సునీల్‌: ఫస్ట్‌ హాఫ్‌ వరకు సోలో పెర్ఫామెన్స్‌ ఉంటుంది. సెకండ్‌ హాఫ్‌లో గ్రూప్‌ కామెడీ ఉంటుంది. నేను, వరుణ్‌ తేజ్‌ ఒక బ్యాచ్‌, వెంకటేశ్‌, రఘుబాబు ఒక బ్యాచ్‌.. ఇలా సినిమాలో కొన్ని బ్యాచ్‌లు ఉంటాయి. అందరం కలిసిన తర్వాత నాన్‌స్టాప్‌ నవ్వులే. ‘ఎఫ్‌2’ కి మూడు రెట్లు ‘ఎఫ్‌3’. కుటుంబమంతా థియేటర్లకు వెళ్లి నవ్వుకొని మరొకసారి రావాలి అనుకునే సినిమా ఇది. ఈ సినిమాకి కచ్చితంగా రిపీట్ ఆడియన్స్ ఉంటారు.

వెంకటేశ్‌,వరుణ్‌ తేజ్‌, ఈ సినిమాలోని హీరోయిన్స్‌తో పని చేయడం ఎలా అనిపించింది?

సునీల్‌: వెంకటేశ్‌ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుణ్‌ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నన్ను 'అన్నా' అని పిలుస్తాడు. హాలీవుడ్‌ కటౌట్‌ తనది. ఇక తమన్నా హైలీ ఎనర్జీటిక్, తెలివైన అమ్మాయి. మెహ్రీన్‌లో తెలియని అమాయకత్వం ఉంటుంది. సోనాల్ చౌహాన్ చాలా సున్నితమనస్కురాలు.

'ఎఫ్‌3'లో మీరు ఫేస్‌ చేసిన ఛాలెంజ్ ఏంటి?

సునీల్‌: ఎఫ్‌3, పుష్ప.. రెండు సినిమాల షూటింగ్స్‌ ఒకేసారి జరిగాయి. ఒక సినిమాలో కామెడీ రోల్‌. రెండో సినిమాలో విలన్‌ పాత్ర. రెండు ఒకే సారి చేయడం కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించింది. విలన్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. 'పుష్ప' సినిమా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. నా కెరీర్‌లో మర్చిపోలేని పాత్ర అది. పుష్ప2లో కూడా నా పాత్ర ఉంటుంది.

ఇప్పుడు కామెడీ సినిమాలు తగ్గిపోతున్నాయి కదా.. దాని ప్రభావం మీపై ఉందా?

సునీల్‌: నా మీద కంటే ప్రేక్షకుల మీద బాగా ప్రభావం ఉంటుంది. నవ్వించే సినిమాలు తీయడం, నవ్వించడం అంత తేలిక కాదు. కామెడీ అనేది పరిస్థితులు, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. సినిమా అనేది అల్టిమేట్‌గా వినోదం. రిలాక్స్‌ అవ్వాలి అంటే కామెడీ సినిమాలు చూడాలి. ప్రతి రోగానికి మందు నవ్వు అని నేను నమ్ముతా.

ఒక పాత్ర చెప్పినపుడు మీకు నచ్చినట్లు చేస్తారా? లేదా దర్శకుడు చెప్పినట్లు చేస్తారా?

సునీల్‌: కొన్ని పాత్రలు మనకోసం రాస్తారు. కొన్ని మనం ఏమైనా చేస్తామని రాస్తారు. నా వరకు అవతలి నుంచి ఏదైనా వస్తేనే రియాక్షన్ వస్తుంది. ఏదైనా స్పాంటేనియస్‌గా రావాల్సిందే. అంతేకాని కూర్చుని అమరకావ్యాలు రాసే టైపు కాదు. ప్లాన్ చేస్తే ఒక్క ముక్కరాదు (నవ్వుతూ).

‘ఎఫ్3’ ట్రైలర్‌లో మీరు చెప్పిన ‘ఆడవాళ్లు...’ డైలాగ్ బాగా పేలింది. నిజ జీవితంలో మీ భార్యకు ఏ సందర్భాల్లో బంగారం కొనిచ్చారు.. రియాక్షన్ ఏంటి ?
సునీల్‌: ఒకసారి కొని తీసుకెళ్ళాను. "మీకు నచ్చిన డిజైన్ తీసుకురావద్దు, మళ్లీ మాకు నచ్చక ఎక్స్ ఛేంజ్ చేసుకోవడం పెద్ద తలనొప్పి. డబ్బులు ఇచ్చేయండి చాలు. నచ్చింది కొనుక్కుంటాం" అన్నారు. తర్వాత ఎప్పుడు తీసుకెళ్లలేదు( నవ్వుతూ).

దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చెప్పండి?

సునీల్‌: చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేస్తున్న అని కాస్త భయం వేసింది. అనిల్‌తో పని చేస్తున్నప్పుడు ఆ భయమంతా పోయింది. నా కామెడీ టైమింగ్‌ అంటే తనకి ఇష్టం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నవ్వుతూనే ఉంటారు. తనని చూసిన వెంటనే ఒక పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. అది నాకు బాగా నచ్చింది. ఆయన సక్సెస్‌ సీక్రెట్‌ కూడా అదే.

డబ్బే మనిషిని శాసిస్తుందని 'ఎఫ్3' ట్రైలర్‌లో చూపించారు కదా .. దీనికి మీరేం చెప్తారు ?

సునీల్‌: నాకు వ్యాపారం చేతకాదు. డబ్బుల లెక్కలు అంతగా రావు. నేను మానవీయ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. ఏదైనా వ్యాపారం చేస్తే అబద్ధం ఆడాలి. అది మళ్లీ నా పిల్లలకు తగులుతుందేమోనని భయపడ్డాను. అందుకే నవ్వించి డబ్బులు సంపాదించాలని ఇక్కడకు వచ్చాను.

కొత్త ప్రాజెక్ట్స్‌ ఏం చేస్తున్నారు?

సునీల్‌: త్రివిక్రమ్‌ సినిమాలో చేస్తున్నాను. చిరంజీవి 'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో, రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో చేస్తున్నా. మరో 13 చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. తమిళం, కన్నడ, బాలీవుడ్‌ నుంచి విలన్‌ పాత్రల కోసం సంప్రదించారు. బాలీవుడ్‌లో కామెడీ పాత్రల ఆఫర్స్‌ వచ్చాయి. రెండు ఓకే చేశా. త్వరలోనే ఆ వివరాలు చెప్తా.

ఇదీ చదవండి: గంగూలీ రియాలిటీ షోలో జాన్వీకపూర్​.. గతంలో శ్రీదేవి కూడా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.