ETV Bharat / entertainment

'ఎఫ్​ 3' @ 100కోట్లు.. 'ఎఫ్​ 4' స్క్రిప్ట్​ వర్క్​ షురూ!

F3 movie collections: వెంకటేశ్​, వరుణ్​ తేజ్​ కలిసి నటించిన ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ సినిమా 'ఎఫ్​ 3'. ఎఫ్​ 2కు ఫ్రాంచైజీగా వచ్చిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై తెగ నవ్వులు పూయిస్తూ... మంచి కలెక్షన్లను అందుకుంటోంది. తాజాగా 100కోట్ల క్లబ్​లోకి అడుగుపెట్టింది. మరోవైపు 'ఎఫ్​ 4' కోసం దర్శకుడు అనిల్​ ఇప్పటి నుంచే కథ సిద్ధం చేస్తున్నారని నిర్మాత దిల్​రాజు పేర్కొన్నారు.

F3 collections 100 crores
ఎఫ్​ 3 100 కోట్లు కలెక్షన్స్​
author img

By

Published : Jun 5, 2022, 12:03 PM IST

F3 movie collections: ఈ వేసవిలో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఎఫ్‌-3'. అనిల్‌ రావిపూడి దర్శకుడు. మూడేళ్ల క్రితం వచ్చిన 'ఎఫ్‌-2' చిత్రానికి ఫ్రాంచైజీగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మే 27న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ సాధించింది. ఈ విషయాన్ని 'ఎఫ్​ 3' సక్సెస్​ సెలబ్రేషన్స్​లో చిత్ర నిర్మాత దిల్​రాజు తెలిపారు.

దిల్‌రాజు మాట్లాడుతూ.. "ఎఫ్‌-3 సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ సాధించింది. 'ఎఫ్‌-2', 'ఎఫ్‌-3'లను మించేలా 'ఎఫ్‌-4' ఉండేలా అనిల్‌ రావిపూడి ఇప్పటి నుంచే కథ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే 'ఎఫ్‌-4'పై అధికారిక ప్రకటన, ఇతర వివరాలు తెలియజేస్తాం" అని అన్నారు.

ఈ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈవెంట్‌ చివర్లో వెంకీమామ, వరుణ్‌ తేజ్‌, అనిల్‌ కలిసి 'కుర్రాడు బాబోయ్‌' పాటకు స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా అది చూసిన నెటిజన్లు.. 'సర్కారువారి పాట' సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఎన్నడూ లేనివిధంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్స్‌ చేసిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: శార్వరి వా​.. సోకుల గాలం వేస్తూ.. సోషల్​మీడియాలో కేక పుట్టిస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.