ETV Bharat / entertainment

నవ్వులు పూయించిన 'ఎక్స్​ట్రా ఆర్డినరీ మ్యాన్'- నితిన్ హిట్టు కొట్టాడా? - నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌

Extraordinary Man Movie Review In Telugu : టాలీవుడ్​ హీరో నితిన్​- యంగ్​ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన 'ఎక్స్​ట్రా- ఆర్డినరీ మ్యాన్' చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా​ ఎలా ఉందంటే?

Extraordinary Man Movie Review In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 3:11 PM IST

Extraordinary Man Movie Review In Telugu : సినిమా: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌, నటీనటులు: నితిన్‌, శ్రీలీల, రాజశేఖర్‌, సుదేవ్‌ నాయర్‌, రావు రమేశ్‌, రోహిణి, సంపత్‌ రాజా, బ్రహ్మాజీ, అజయ్‌, తదితరులు; సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ. విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్; ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి; సంగీతం: హరీశ్‌ జయరాజ్‌; నిర్మాణ సంస్థ: శ్రేష్ఠ మూవీస్‌; నిర్మాతలు: సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి; రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ; విడుదల తేదీ: 08-12-2023

టాలీవుడ్​ హీరో నితిన్​కు 'భీష్మ' తర్వాత మళ్లీ సరైన హిట్టు పడలేదు. మంచి అంచనాలతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన 'రంగ్‌ దే', 'మాస్ట్రో', 'మాచర్ల నియోజకవర్గం' వంటి చిత్రాలు బాక్సాఫీసు ముందు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే విజయమే లక్ష్యంగా ఈసారి ఓ వినోదభరిత కథాంశాన్ని ఎంచుకున్నారు నితిన్. అదే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌'. 'నా పేరు సూర్య' తర్వాత దర్శకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఇందులో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ఓ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ టీజర్, ట్రైలర్​ వినోదభరితంగా ఉండటం వల్ల విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి 'ఈ ఎక్స్​ట్రా ఆర్టినరీ మ్యాన్​' అంచనాల్ని అందుకున్నాడు? ఈ చిత్రంతో నితిన్‌ మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారా? డైరెక్టర్​గా వక్కంతం వంశీ మొదటి విజయాన్ని అందుకున్నారా? అనే విషయాలు తెలుసుకుందాం.

స్టోరీ ఎంటంటే?
అభి అలియాస్‌ అభయ్‌ (నితిన్‌)కు చిన్నప్పటి నుంచి మరో వ్యక్తిలా ఉండటమంటే ఇష్టం. ఆ వ్యక్తిత్వమే అతడిని జూనియర్‌ ఆర్టిస్ట్‌ అయ్యేలా చేస్తుంది. కానీ, తనకెంత ప్రతిభ ఉన్నా సినీ పరిశ్రమలో సరైన గుర్తింపు, గౌరవం దక్కదు. ఇక సినిమా షూటింగ్స్‌ల్లో దర్శకులెప్పుడూ అతన్ని కెమెరా లెన్స్‌కు దొరకనంత వెనకగానే నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలా సాదాసీదాగా సాగిపోతున్న అతని జీవితంలోకి లిఖిత (శ్రీలీల) వస్తుంది. ఆమె ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. తనతో అభి ప్రేమలో పడ్డాక.. అతడి జీవితం మారిపోతుంది. లిఖిత వాళ్ల కంపెనీలో సీఈవో స్థాయికి చేరుకుంటాడు అభి. సరిగ్గా అదే సమయంలో అతనికి హీరోగా చేసే అవకాశం లభిస్తుంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కోటియా గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ అది. అందులోని రావణుడిలాంటి నీరో అలియాస్‌ నిరంజన్‌ (సుదేవ్‌ నాయర్‌) అనే ప్రతినాయకుడి ఆటకట్టించడానికి సైతాన్‌ అనే పోలీస్‌ ఎలాంటి సాహసాలు చేశాడన్నది ఆ కథలో కీలకాంశం. ఈ కథ అభికి విపరీతంగా నచ్చడం వల్ల తొలుత మూవీ చేయకూడదనుకుంటాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని ఆ చిత్రం కోసం ఉద్యోగాన్ని ప్రేమించిన అమ్మాయిని వదులుకొని కష్టపడతాడు. కానీ, తీరా సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయానికి దర్శకుడు అభిని కాదని మరో హీరోతో ఆ చిత్రం పట్టాలెక్కించాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో అభికి ఓ చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. తను విన్న కథలో ఉన్న ప్రతినాయకుడు నీరోతో నిజంగా తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం తను దొంగ పోలీస్‌గా కోటియా గ్రామంలోకి అడుగు పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? కోటియా గ్రామాన్ని.. అక్కడి ప్రజల్ని నీరో బారి నుంచి రక్షించేందుకు అభి ఎలాంటి సాహసాలు చేశాడు? అతను నిజమైన పోలీస్‌ కాదని తెలుసుకున్న ఐజీ విజయ్‌ చక్రవర్తి (రాజశేఖర్‌) ఏం చేశాడు? ఒక జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా ఎలా పేరు తెచ్చుకున్నాడు? అన్నది ఆసక్తికరం.

సినిమా సాగిందిలా!
ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా చేసిన చిత్రమిది. అందుకే లాజిక్‌లను పక్కకు పెట్టి మరీ కథలో కామెడీ ట్రాక్‌లను వరుసగా పేర్చుకుంటూ వెళ్లిపోయారు దర్శకుడు వక్కంతం వంశీ. అయితే ఆ ట్రాక్‌లు ఎంత వినోదభరితంగా సిద్ధం చేసినా వాటిని కథలో సహజంగా ఇమడ్చలేనప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా ప్రయాసే అవుతుంది. దీనికి ఈ కథే మంచి ఉదాహరణ. నిజానికి ఈ తరహా కథలు తెలుగు తెరపై చాలానే చూశాం. ఆ తెలిసిన స్టోరీలకే కొన్ని ట్విస్ట్‌లతో పాటు వినోదాన్ని జోడించి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. అయితే అది కొంత వరకు ప్రేక్షకుల్ని మెప్పించినా చిత్రం చూస్తున్న కొద్దీ నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఈ మూవీ ఓ మంచి ఛేజింగ్‌ సీన్‌తో, ఓ స్మగ్లర్‌కు హీరో తన కథ చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా సెట్‌లో అభి ఎదుర్కొనే ఇబ్బందులు.. ఇంట్లో తన తండ్రితో పడే చివాట్లు.. అన్నీ సరదాగా ఉంటాయి. ఇక అభి జీవితంలోకి కథానాయిక ప్రవేశించాక సినిమా కాస్త నెమ్మదిస్తుంది. వీళ్లిద్దరి ప్రేమకథలో ఏమాత్రం ఫీల్‌ కనిపించదు. అయితే హీరోయిన్ ఇంటికి హీరో తొలిసారి వెళ్లినప్పుడు అక్కడే స్ఫూఫ్‌ సాంగ్స్​తో చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. బాలకృష్ణ చెంప దెబ్బల అంశం విజయ్‌ - రష్మికల లవ్‌ టాపిక్‌ నరేశ్‌ - పవిత్రా లోకేష్‌ల ప్రేమ అంశం ఇలాంటి ట్రెండింగ్‌ ఎలిమెంట్స్‌ని ఈ ఎపిసోడ్‌లో ఫన్నీగా మిక్స్‌ చేశారు. ఇక ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ను తీర్చిదిద్దుకున్న విధానం సెకండ్​ హాఫ్​పై ఆసక్తి పెంచేలా చేస్తుంది.

హీరో దొంగ పోలీస్‌గా అవతారమెత్తి కోటియా గ్రామంలోకి అడుగు పెట్టడం అక్కడ విలన్ నీరోతో తలపడటంతో ద్వితీయార్ధంలో అసలు కథ ప్రారంభమవుతుంది. అయితే హీరోగా పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో తనది కాని సమస్యలో హీరో కాలుపెట్టడమన్నది అంత కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు. దానికి తోడు ద్వితీయార్ధంలో స్క్రీన్‌ప్లేతో ఏదో మ్యాజిక్‌ చేయాలనే తాపత్రయంలో అసలు కథను కంగాళి చేశారు. ఐజీగా రాజశేఖర్‌ పరిచయ సన్నివేశాలు.. ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటాయి. ఆయనకు.. నితిన్‌కూ మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు తెరపై చక్కగా పండాయి. ఇక 'నా పెట్టె తాళం తీయవా' పాటతో పోలీస్‌స్టేషన్‌లో నితిన్‌ తన పోలీస్‌ గ్యాంగ్‌తో చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం సీక్వెల్‌ ట్రెండ్‌ను అనుసరిస్తూ.. దీనికీ కొనసాగింపు ఉంటుందంటూ ఆఖరిలో హింట్‌ ఇచ్చి సినిమాని ముగించారు.

ఎవరు ఎలా చేశారంటే?
జూనియర్‌ ఆర్టిస్ట్‌ అభిగా నితిన్‌ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించారు. భిన్నమైన లుక్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లిఖిత పాత్రలో శ్రీలీల అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. చిత్రమేంటంటే ఈ పాత్ర 'ఆదికేశవ'లో తను పోషించిన పాత్రకు చాలా దగ్గరగా ఉంది. రాజశేఖర్‌ ఇందులో ఐజీగా కీలక పాత్ర పోషించారు. తెరపై ఆయన కనిపించినంత సేపూ ప్రేక్షకుల్లో ఓ ఊపు కనిపిస్తుంది. ప్రతినాయకుడు నీరో పాత్రలో సుదేవ్‌ నాయర్‌ భీకరమైన లుక్స్‌తో కనిపించారు. హీరో తండ్రిగా రావు రమేష్‌ ఓ భిన్నమైన మేనరిజం, కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం నవ్వులు పూయించారు. రోహిణి, బ్రహ్మాజీ, ఆది, సత్యశ్రీ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.

వక్కంతం వంశీ కామెడీపై పెట్టినంత శ్రద్ధ కథపై అసలు పెట్టలేకపోయారు. సినిమాని ఆరంభించిన తీరుకు.. ముగించిన విధానానికీ సంబంధం లేదు. ప్రథమార్ధంలో కథ లేకున్నా బాగానే కాలక్షేపాన్నిస్తుంది. ద్వితీయార్ధం మాత్రం రోటీన్‌ ఫార్మాట్‌లో సాగుతుంది. పతాక సన్నివేశాలు ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది.. హారిస్‌ జయరాజ్‌ పాటల్లో 'డేంజర్‌ పిల్లా', 'ఒలే ఒలే పాపాయి' పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. ఛాయాగ్రహణం కథకు తగ్గట్లుగా ఉంది. సినిమాలో కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ద్వితీయార్ధంలో సుమారు 20నిమిషాలు కట్‌ చేసినా కథకు వచ్చే నష్టమేమీ లేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + నితిన్‌ నటన
  • + సినిమాలోని వినోదం
  • + విరామ సన్నివేశాలు
  • బలహీనతలు
  • - కథ, స్క్రీన్‌ప్లే
  • - ద్వితీయార్ధం
  • చివరిగా: ఆర్డినరీ కామెడీ ఎంటర్‌టైనర్‌
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

Yash 19కు టైటిల్ ఖరారు - స్పెషల్ వీడియోతో రివీల్​ చేసిన మేకర్స్

'టాప్​గన్ : మెవరిక్​' రేంజ్​లో 'ఫైటర్​' టీజర్- యాక్షన్​ మోడ్​లో హృతిక్, దీపిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.