ETV Bharat / entertainment

కంగనా 'ఎమర్జెన్సీ' టీజర్ విడుదల.. సినిమా రిలీజ్ డేట్​ ఫిక్స్​

Emergency Teaser : బాలీవుడ్​ స్టార్ నటి కంగనా రనౌత్​ కీలక పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా టీజర్ విడుదలయ్యింది. టీజర్​తో పాటు సినిమాకు సంబంధించిన ఓ ముఖ్యమైన అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. అదేెంటంటే!

Emergency Teaser
కంగనా 'ఎమర్జెన్సీ' టీజర్ విడుదల
author img

By

Published : Jun 24, 2023, 3:38 PM IST

Updated : Jun 24, 2023, 4:58 PM IST

Emergency Teaser : బాలీవుడ్​ స్టార్ నటి కంగనా రనౌత్​ ప్రధాన పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా టీజర్​ను మూవీ యూనిట్ శనివారం విడుదల చేసింది. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. టీజర్​లో 'ఇండియా ఈజ్ ఇందిరా.. ఇందిరా ఈజ్ ఇండియా' అన్న డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది.

ఈ సినిమాకు కంగనా రనౌత్ స్వయంగా తానే దర్శకత్వం వహిస్తున్నారు. మణికర్ణిక ఫిలిమ్స్​ బ్యానర్​పై తెరకెక్కుతున్న 'ఎమర్జెన్సీ' చిత్రానికి కంగనా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలోని ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన కంగనా.. తాజాగా ఈ చిత్ర టీజర్​ను తన ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పే కంగనా ఈ సినిమాలో దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఎలా చూపిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాతో 1975 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని దాదాపు 48 ఏళ్ల తర్వాత ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నారు కంగనా. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఏర్పడడం 'మన చరిత్రలో అది ఓ చీకటి దశ' అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ లాంటి సినిమాకు దర్శకత్వం వహించడం. అందులో ఇందిరా గాంధీ పాత్రలో నటించడాన్ని ఛాలెంజింగ్​గా తీసుకున్నారని అన్నారు. కాగా ఇటీవలె 'ఎమర్జెన్సీ' సినిమా చూసి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారని కంగనా తెలిపారు.

'మన చరిత్రలో అత్యవసర పరిస్థితులు ఓ చీకటి అధ్యాయం. దేశ రాజకీయ చరిత్రలో.. ప్రజలు ఇలాంటి ఓ సందర్భాన్ని ఎదుర్కొన్నారని ప్రస్తుత యువ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో నటించిన శ్రేయస్, మహిమ, మిలింద్, అనుపమ్​ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ చరిత్ర పుటల్లోంచి ఇలాంటి అసాధారణ ఘట్టాన్ని తెరకెక్కించినందుకు సంతోషిస్తున్నాను.' అని కంగనా అన్నారు.

ఈ చిత్రంలో కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ అనుపమ్ ఖేర్ , మమతా చౌదరీ, విశాక్ నాయర్​ కీలక పాత్రల్లో నటించారు. నటుడు శ్రేయస్ తల్పాడే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్ర పోషించారు. కాగా కంగనా ఇదివరకు 'మణికర్ణిక' అనే సినిమాకు దర్శకత్వం వహించగా తాజా ఎమర్జెన్సీ సినిమా రెండోది.

Last Updated : Jun 24, 2023, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.