ETV Bharat / entertainment

ఇందిరా గాంధీగా కంగనా.. మరోసారి మెగాఫోన్​.. 'ఎమర్జెన్సీ' షూటింగ్​ షురూ - కంగనా రనౌత్

ఎమర్జెన్సీ సినిమా టీజర్​ రిలీజైంది. ఇందిరా గాంధీగా కంగనా లుక్​ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు. ఎమర్జెన్సీ దేశ రాజకీయ చరిత్రలో కీలకపాత్ర పోషించిందని అందుకే ఈ కథ చెప్పాలనుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు.

కంగనా రనౌత్
కంగనా రనౌత్
author img

By

Published : Jul 14, 2022, 12:45 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్ కంగనా రనౌత్​ మరోసారి మెగాఫోన్​ పట్టారు. ఇప్పటికే మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించిన అనుభవం ఉన్న ఈ బాలీవుడ్ భామ.. ఇప్పుడు స్వీయదర్శకత్వంలో దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్నారు. ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణం, ఆ సమయంలో జరిగిన ఘటనలపై ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. గురువారం ఈ చిత్రం షూటింగ్​ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ టీజర్​ను రిలీజ్​ చేశారు కంగనా. ఈ టీజర్​కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. ఇందిరా గాంధీగా కంగనా లుక్​, హావభావాలు చాలా పర్ఫెక్ట్​గా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

కంగనా రనౌత్
'ఎమర్జెన్సీ' ఫస్ట్​లుక్​

"ఎమర్జెన్సీ దేశ రాజకీయ చరిత్రలో చాలా కీలకమైన సమయం. అధికారంపై మనం చూసే కోణాన్ని మార్చేసింది. అందుకే ఈ కథను చెప్పాలనుకుంటున్నాను" అని కంగనా టీజర్​ రిలీజ్​ సందర్భంగా పేర్కొన్నారు. 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. 1977 వరకు దాదాపు 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. 'పింక్​' ఫేమ్​ రితీశ్​ షా ఈ చిత్రానికి స్క్రీన్​ప్లే, డైలాగులు అందించగా.. కంగనా, రేణు పిట్టీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్నట్టు.. ఈ సినిమాకు కథ కూడా కంగనానే అందిస్తున్నారు. కంగనా.. ఇదివరకు దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథపై తెరకెక్కిన తలైవిలో కూడా ప్రధాన పాత్ర పోషించి మెప్పించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : మొదటి భార్య పేరు కలిసేలా.. దిల్​రాజు కొడుకు పేరు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.