ETV Bharat / entertainment

రవితేజ 'ఈగల్' ట్రైలర్ ఔట్- విషం మింగే విధ్వంసకారుడిగా మాస్ మహారాజా - ఈగల్ సినిమా విడుదల తేదీ

Eagle Trailer : మాస్ మహరాజ్ రవితేజ- అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ లీడ్ రోల్స్​లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఈగల్'. చిత్ర బృందం బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ రీలీజ్​ చేసింది.

Eagle Trailer
Eagle Trailer
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 9:56 PM IST

Updated : Dec 20, 2023, 10:22 PM IST

Eagle Trailer : మాస్ మహరాజ్ రవితేజ- అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ లీడ్ రోల్స్​లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఈగల్'. దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ రీలీజ్​ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న గ్రాండ్​గా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తాజా ట్రైలర్​తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. డైరెక్టర్ కార్తిక్ ట్రైలర్ గన్స్​తో ఫుల్​ వైలెన్స్​ క్రియేట్ చేశాడు. 'విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను','విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను', 'మార్గశిరం మధ్య రాత్రి మొండి మోతుబరి మారణ హోమం', 'తుపాకీ నుంచి బుల్లెట్ ఆగేది, అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు', 'ఆయుధంతో విధ్వంసం చేసే వాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు' డైలాగ్స్​తో ఇంట్రెస్టింగ్​గా సాగింది ట్రైలర్. ఈ సినిమాలో నటుడు నవదీప్, శ్రీనివాస్ అవసరాల కీ రోల్స్​లో నటిస్తున్నారు. మధుబాల, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ డావ్‍జంద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Tiger Nageswara Rao : మాస్ మహారాజా రవితేజ రీసెంట్​గా 'టైగర్ నాగేశ్వరరావు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను 1970 కాలంలో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ వంశీ తెరకెక్కించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇక రవితేజకు జోడీగా నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. కాగా, ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజైంది.

ఆచితూచి అడుగులేయనున్న మాస్​ మహారాజ 'ఈగల్'​కు ఇది అసలు పరీక్ష!

Tiger Nageswara Rao Review : 'టైగర్ నాగేశ్వరరావు' రివ్యూ.. రవితేజ ఖాతాలో హిట్ పడ్డట్లేనా?

Last Updated : Dec 20, 2023, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.