ETV Bharat / entertainment

రవితేజ 'ఈగల్' రిలీజ్ వాయిదా- సంక్రాంతి బరిలో ఇక నాలుగు చిత్రాలే! - ఈగల్ సినిమా వాయిదా

Eagle Movie Postponed : ఈ ఏడాది సంక్రాంతి రేసు నుంచి రవితేజ సినిమా ఈగల్ తప్పుకుంది. ఈ సినిమా రిలీజ్​ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్​ను వెల్లడించారు.

Eagle Movie Postponed
Eagle Movie Postponed
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 9:28 PM IST

Updated : Jan 4, 2024, 9:35 PM IST

Eagle Movie Postponed : 2024 సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆ లిస్ట్​లో టాలీవుడ్​ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్​ అధికారికంగా వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్​ను ప్రకటించారు.

సంక్రాంతి సినిమాల విడుదలపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ గురువారం సమావేశమయ్యాయి. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై ఆయా నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈగల్ నిర్మాత తమ సినిమా విడుదలను వాయిదా వేసేందుకు అంగీకరించారు. దీంతో గుంటూరు కారం (జనవరి 12), హనుమాన్‌(జనవరి 12), సైంధవ్‌ (జనవరి 13), నాగార్జున నా సామిరంగ (జనవరి 14) సంక్రాంతి బరిలో నిలవనున్నాయి.

రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రమే ఈగల్‌. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు. జనవరి 13న రావాల్సిన ఈ చిత్రానికి ఇప్పటికే సెన్సార్‌ పూర్తయింది. ఈగల్‌ వాయిదా పడే అవకాశాలున్నాయంటూ వచ్చిన వార్తలను చిత్ర బృందం కొన్ని రోజులుగా ఖండిస్తూ వచ్చింది. నిర్మాతలు కూడా ఈగల్‌ సంక్రాంతికి తప్పక విడుదల అవుతుందని ఇటీవలే స్పష్టం చేశారు. తాజా చర్చల అనంతరం వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నారు.

"ఓ సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్లు కాదు. మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇజ. రవితేజ, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇదొక మంచి పరిణామం. గుంటూరు కారం, హనుమాన్‌ ఒకే రోజున విడుదలకాబోతున్నాయి. ఓకే తేదీన కాకుండా వేర్వేరుగా వచ్చేలా ప్రయత్నిస్తాం" అని దిల్​రాజు తెలిపారు. "15 రోజుల క్రితం నిర్మాతలతో సమావేశమై పలు కోణాల్లో చర్చించాం. అందరూ సహకరించారు. ఈగల్ ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్‌" అని దామోదర ప్రసాద్‌ పేర్కొన్నారు. "రవితేజ చెప్పడంతో మా సినిమా వాయిదాకు అంగీకరించాం. ఫ్యాన్స్‌ నిరాశ పడొద్దు. సినిమా మీరంతా కాలర్‌ ఎగరేసుకునేలా ఉంటుంది" అని ఈగల్‌ నిర్మాతలు తెలిపారు.

ఏది చూసినా 'ఫ్రెష్' జోడీయే- సంక్రాంతి మూవీల్లో సూపర్​ కామన్​ పాయింట్!

బ్లాక్‌బస్టర్ బొమ్మ లోడింగ్! 'గుంటూరు కారం' సెన్సార్ కంప్లీట్​- ఈల వేయాలనిపిస్తుందట!

Last Updated : Jan 4, 2024, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.