ETV Bharat / entertainment

షారుక్​ సినిమాకు తప్పని కన్​ఫ్యూజన్​ - రెండు డేట్ల మధ్య 'డంకీ' పోరాటం - 'సలార్' సేఫేనా? - డంకీ మూవీ లేటెస్ట్ అప్​డేట్స్

Dunki Vs Salaar : డిసెంబర్​లో 'సలార్​', 'డంకీ' సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రాలు తమ రిలీజ్​ డేట్​లను ఖారారు చేసుకుని ప్రమోషనల్​ ఈవెంట్లలో బిజీ అయిపోయాయి. కానీ 'డంకీ' మాత్రం ఇంకా కన్​ఫ్యూజన్​లో ఉందట. ఎందుకంటే..

Dunki Vs Salaar
Dunki Vs Salaar
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 1:06 PM IST

Dunki Vs Salaar : డిసెంబర్​ దగ్గర పడుతున్న కొద్దీ మూవీ లవర్స్​లో ఉత్కంఠ మొదలవుతోంది. శీతాకాల సెలవులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు మూవీ మేకర్స్​ కూడా తమ సినిమాలను విడుదల చేసేందుకు రంగంలోకి దిగారు. ఇందులో 'సలార్​', 'డంకీ', 'హాయ్​ నాన్న', 'ఎక్స్​ట్రాడనరీ మ్యాన్​', 'కెప్టెన్​ మిల్లర్​' ఆపరేషన్​ మిల్లర్​ లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం ఇప్పుడు 'సలార్​', 'డంకీ'పై పడింది. దీనికి కారణం ఈ రెండు జట్లు ఒకే రోజు రిలీజయ్యేందుకు సిద్ధమయ్యాయి.

వాస్తవానికి సెప్టెంబర్​ 28న సలార్ రిలీజ్​ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్​ 22న విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే అప్పటికే డంకీ సినిమా తమ విడుదల తేదీని ఖారారు చేసింది. క్రిస్మస్​ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేసింది. ఇలా పెద్ద సినిమాలు ఒకే తేదీని లాక్​ చేయడం వల్ల బాక్సాఫీస్​ వద్ద క్లాష్​ అయ్యే సూచనలు కనిపించాయి.

కానీ అనివార్య పరిస్థితుల్లో 'సలార్' పోటీ వచ్చి పడటం వల్ల 'డంకీ'కి సమస్య ఎదురైంది. దీంతో ఆ సినిమా రిలీజ్​ డేట్​పై సస్పెన్స్​ మొదలైంది. చూస్తుంటే 'డంకీ' వెనక్కి తగ్గే ఆలోచనలో కనిపించనప్పటికీ.. ప్రమోషన్లలో మాత్రం ఎక్కడా రిలీజ్ డేట్​ను చెప్పకుండా జాగ్రత్త పడుతోంది. దీంతో పలు అనుమానాలకు తెరతీస్తున్నట్లు అయ్యింది. అయితే అనుకున్నట్లే డిసెంబర్ 21న డంకీ థియేటర్లలో రావడం ఖాయమని ఇటీవలే ఒక పోస్టర్​ను విడుదల చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన టీజర్​లో మాత్రం ఎక్కడా ఈ విషయాన్ని హైలైట్ చేయలేదు. దీంతో షారుక్ ఫ్యాన్స్​ కన్​ఫ్యూజన్​లో పడిపోయారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అయితే బీ టౌన్​ వర్గాల సమాచారం ప్రకారం.. 'డంకీ' మూవీ టీమ్​ ప్రస్తుతం రెండు డేట్లను పరిశీలిస్తోందట. తొలుత అనుకున్న ప్రకారం డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటోందట. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లలో షోలు వేసుకోవచ్చని వారి అభిప్రాయం. కానీ 'ఆక్వామెన్' కారణంగా ఓవర్ సీస్​లో 'డంకీ'కి ఇబ్బందులు తలెత్తుతాయి. అంతే కాకుండా ఒకవేళ 'సలార్' బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఇక దక్షిణాది థియేటర్ కౌంట్ తగ్గిపోతుంది.

మరోవైపు డిసెంబర్ 25 రిలీజ్​కు మరో మంచి ఆప్షన్​గా భావించవచ్చు. కానీ అప్పటికే వచ్చే లాంగ్​ వీకెండ్​ను వదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో 'డంకీ' టీమ్​ తలలు పట్టుకుంది. ఏ డేట్​ ఫిక్స్​ చేయాలో అంటూ సతమతమౌతోంది. ఏదీ ఏమైనప్పటికీ..ఈ విషయంపై ఇంకో వారం పది రోజుల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్​ వైపు నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో 'సలార్' మూవీ తమ ప్రమోషనల్ ఈవెంట్స్​ను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ట్రైలర్ రిలీజ్​కు టైమ్ ఫిక్స్​ చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రమోషన్లను పీక్స్​కు తీసుకెళ్లేలా హోంబాలే ఫిలింస్ ప్లాన్ చేస్తోందట. ఇలాంటి పరిస్థితుల్లో 'డంకీ' త్వరలోనే మూవీ రిలీజ్​ డేట్​ను ఫిక్స్​ చేసుకుంటే ఒ సమస్య నుంచి బయటపడొచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

బాద్​ షా బర్త్​ డే ట్రీట్​ - కామెడీ అండ్​ ఎమోషనల్​ డ్రామాగా 'డంకీ' టీజర్​​

'సలార్​' బిగ్ అప్​డేట్ - ట్రైలర్​ రిలీజ్​కు మహుర్తం ఫిక్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.