ETV Bharat / entertainment

'డంకీ' మీనింగ్​ అదేనట- షారుక్ క్లారిటీ​- మరి సలార్ అంటే ఏంటో తెలుసా?

Dunki Title Meaning : ప్రస్తుతం ఎక్కడ చూసినా డంకీ, సలార్​ టైటిల్స్​ గురించే చర్చ జరుగుతోంది. వాటి మీనింగ్​ తెలుసుకోవాలంటూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకీ వీటికి అర్థం ఏంటంటే?

Dunki Title Meaning
Dunki Title Meaning
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 2:47 PM IST

Dunki Title Meaning : బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'డంకీ'. క్రిస్మస్​ కానుకగా ఈ మూవీ డిసెంబర్​ 21న విడుదలైంది. ప్రస్తుతం పాజిటివ్​ టాక్ అందుకుని థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ మూవీ టైటిల్ అనౌన్స్​ చేసినప్పటి నుంచి పేరు చాలా కొత్తగా ఉందంటూ దీనికి అర్థం తెలుసుకునేందుకు నెట్టింట తెగ వెతికేశారు. అయితే తాజాగా దీని అసలు మీనింగ్​ను హీరో షారుక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"డంకీ అనేది ఓ చట్టవిరుద్ధమైన ప్రయాణం. దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్‌ అంటారు. పంజాబీలోని ఓ సామెత ప్రకారం ఈ పేరు వచ్చినట్లు షారుక్ తెలిపారు. అంతే కాకుండా వాళ్లు దాన్ని డంకీ అంటారని అలా డంకీ రూట్​ అనే పేరు వాడుకలోకి వచ్చింది" అని ఆయన వివరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించే వలసదారుల కారణంగా ఈ పద్ధతి పాపులరైంది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి వలసదారులు చాలా మంది ఉన్నారట. ఇలా 'డంకీ ఫ్లైట్స్' పద్దతిలో అక్రమంగా వలస వెళ్తుంటారంటూ వార్తలు కూడా వస్తుంటాయి. అయితే డంకీ సినిమా వల్ల ఈ పేరు మరోసారి నెట్టింట మార్మోగింది. మరోవైపు 'శిద్ధత్​', 'కామ్రేడ్ ఇన్​ అమెరికా', 'ఆజా మెక్సికో చలియే' లాంటి సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్​తో తెరకెక్కినవే.

Salaar Title Meaning : మరోవైపు సలార్​ మూవీ మీనింగ్​ గురించి కూడా అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. దీంతో ఈ టైటిల్​కు అర్థాన్ని తాజాగా డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ వివరించారు. సలార్‌ అనేది ఓ ఉర్దూ పదం అని దీని అర్థం సమర్థవంతుడైన నాయకుడని, రాజుకు కుడిభుజంగా ఉంటూ, అత్యంత నమ్మదగిన ఓ వ్యక్తి ని అలా పిలుస్తారంటూ నీల్​ వివరణ ఇచ్చాడు. ఇది విన్న ఫ్యాన్స్​ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోయారంటూ ఆయన్ను కొనియాడుతున్నారు. ప్రస్తుతం 'డంకీ', 'సలార్​' సినిమాలు బాక్సాఫీస్​ వద్ద పోటీ పడుతున్నాయి.

భారీ ధరకు అమ్ముడుపోయిన 'డంకీ' ఓటీటీ రైట్స్ - స్ట్రీమింగ్ అప్పుడే!

'తండేల్'​ టు 'తంగలాన్' ​- టైటిల్స్​లో కొత్త ట్రెండ్​ - వీటికి అర్థాలు తెలుసా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.