Dunki Screening At Rastrapathi Bhavan : సామాజిక అంశాన్ని జోడించి సినిమాలు తీయడంలో డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీకి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో తాజాగా 'డంకీ' సినిమాను తెరకెక్కించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 21 థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం మంచి టాక్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వసూలు చేస్తూ దుసుకెళ్తోంది. అలా అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్ థియేటర్లలో ఈ సినిమా 'సలార్'తో పాటు సందడి చేస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకు థియేటర్లలో అలరిస్తున్న ఈ సినిమాను ఓ స్పెషల్ వేదికపై చూపించేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. అదెక్కడో కాదు మన రాష్ట్రపతి భవన్లో. దిల్లీలోని ఈ ప్రతిష్టాత్మక భవనంలో 'డంకీ'ని నేడు (డిసెంబర్ 24)న ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసి చూపించనున్నట్లు మూవీ టీమ్ పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న షారుక్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. 'డంకీ' సినిమాను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్టోరీ ఏంటంటే ?
Dunki Movie Story : పంజాబ్‌లోని ఓ చిన్న పల్లెటూరికి చెందిన మన్ను (తాప్సి), బుగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్). ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. వాటి నుంచి గట్టెక్కడానికి ఇంగ్లండ్ వెళ్లడమే మార్గం అని అనుకుంటారు. కానీ, వీసాలకి తగినంత చదువు, డబ్బు వీరి దగ్గర ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి పఠాన్ కోట్ నుంచి జవాన్ హర్ దయాల్ సింగ్ థిల్లాన్ అలియాస్ హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) వస్తాడు. ఆ నలుగురి పరిస్థితులను అర్థం చేసుకుని సాయం చేయాలనుకుంటాడు. ఇందు కోసం రకరకాల ప్రణాళికలను రచిస్తాడు. వీసా ఇంటర్వ్యూల్లో గట్టెక్కేందుకు గులాటి (బొమన్ ఇరానీ) దగ్గర అందరూ కలిసి ఇంగ్లిష్ కూడా నేర్చుకుంటారు. కానీ, ఆ ఐదుగురిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. మిగిలినవారికి దారులు మూసుకుపోతాయి. అయినా సరే, అక్రమ మార్గాన (డంకీ ట్రావెల్) ఇంగ్లండ్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వాళ్లకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్ని దేశాల సరిహద్దుల్ని దాటి వెళ్లగలిగారా? ఇంతకీ వాళ్ల సమస్యలేమిటి? తిరిగి మాతృదేశానికి వచ్చారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాను థియేటర్లో చూసేయాల్సిందే.
'ఇకపై వయసుకు తగ్గ పాత్రలు చేస్తా'- డంకీ రిలీజ్ తర్వాత షారుక్ షాకింగ్ డెసిషన్!