ETV Bharat / entertainment

'సలార్'​ కాదు- 'ఆదిపురుష్'​ను కూడా 'డంకీ' టచ్​ చేయలేకపోయిందట! - డంకీ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Dunki Day 2 Collections : ఒక్కరోజు వ్యవధిలోనే స్టార్​ హీరోల సినిమాలు 'సలార్', 'డంకీ' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఓ రేంజ్​లో ఉంటుందని అందరూ భావించారు. కానీ 'డంకీ' ప్రభాస్​ సినిమా 'ఆదిపురుష్'​ కలెక్షన్స్​ కూడా అందుకోలేకపోయింది.

Dunki Day 2 Collections
Dunki Day 2 Collections
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 1:18 PM IST

Updated : Dec 23, 2023, 4:05 PM IST

Dunki Day 2 Collections : 2023 సంవత్సరం చివర్లో రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్​ వద్ద పోటీకి వచ్చాయి. బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన సినిమా 'డంకీ' డిసెంబర్ 21న, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సలార్' ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ 'డంకీ' కలెక్షన్స్​లో 'సలార్​'కు పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. 'పఠాన్', 'జవాన్' బ్లాక్ బస్టర్​ చిత్రాల తర్వాత వచ్చిన 'డంకీ' కూడా రికార్డుల మోత మోగిస్తుందని అభిప్రాయపడ్డారు. కానీ తొలి రోజు అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి.

  • #Dunki Opening Day Data:☑️

    Worldwide Gross: 58 Cr
    India Net: 29.2 Cr / 35.00 Cr Gross
    Footfalls: 14.92L

    Good Opening For Post Pandemic Drama Genre and mid-week release. Holiday Period will help, If Saturday sees good Jump then it is expected to have long run at the box…

    — Sacnilk Entertainment (@SacnilkEntmt) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తగ్గిన రెండో రోజు కలెక్షన్స్
'సలార్'​కి పోటీ విషయం పక్కన పెడితే ప్రభాస్ సినిమా 'ఆదిపురుష్' మొదటి రోజు కలెక్షన్స్ కంటె తక్కవగా 'డంకీ'కి వచ్చాయి. 'ఆదిపురుష్' సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీ నుంచే దాదాపు రూ.45 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు 'డంకీ' వరల్డ్ వైడ్​గా రూ.58 కోట్లు, హిందీ రీజియన్​లో కేవలం రూ.38 కోట్లు వసూలు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన 'డంకీ' సినిమా 'సలార్' దెబ్బతో వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఇక రెండో రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూ. 20.50 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజుతో పోల్చితే తక్కవగానే వచ్చాయి. మొత్తంగా రూ.49.7 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

మరోవైపు, 'సలార్' ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కలెక్షన్స్ రూ. 178.7 కోట్లు వసూలైందని మూవీ మేకర్స్​ తాజాగా ఓ పోస్టర్​ విడుదల చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌ ద్వారానే రూ.90 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చిన చిత్రంగా 'సలార్‌' రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తర్వాతి స్థానంలో దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్‌ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్​తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి.

'ఇకపై వయసుకు తగ్గ పాత్రలు చేస్తా'- డంకీ రిలీజ్ తర్వాత షారుక్ షాకింగ్ డెసిషన్​!

'డంకీ' మీనింగ్​ అదేనట- షారుక్ క్లారిటీ​- మరి సలార్ అంటే ఏంటో తెలుసా?

Last Updated : Dec 23, 2023, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.