ETV Bharat / entertainment

'డీజే టిల్లు- స్క్వేర్​' అప్డేట్​ - రాధిక 'యాంథమ్' రిలీజ్​! - డీజే టిల్లు స్క్వేర్ డైరెక్టర్ పేరు

DJ Tillu Square Radhika Song Released : కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం డిజే టిల్లు స్క్వేర్. తాజాగా ఈ సినిమా నుంచి రాధిక 'యాంథమ్'​ను చిత్ర బృందం విడుదల చేసింది. యూత్​ను ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట మీరూ వినేయండి.

DJ Tillu Square Radhika Song Released
DJ Tillu Square Radhika Song Released
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 5:28 PM IST

Updated : Nov 27, 2023, 7:25 PM IST

DJ Tillu Square Radhika Song Released : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హాట్​ బ్యూటీ నేహా శెట్టి జంట నటించిన చిత్రం 'డీజే టిల్లు'. గతేడాది సాదారణ చిత్రంగా విడుదలైన ఈ సినిమా.. అంచనాలకు మించి బాక్సాఫీసు ముందు విజయం సాధించింది. అంత క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌ 'డీజే టిల్లు స్క్వేర్' తీస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. అందులో హీరోయిన్​గా అందాల నటి అనుపమ పరమేశ్వరన్‌ తీసుకున్నారు. ఈ సినిమాకు మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్​ ఇచ్చింది చిత్ర బృందం. 'రాధిక.. రాధిక..' అంటూ సాగే లిరికల్ సాంగ్​ను రిలీజ్ చేసింది. సెన్సేషనల్ సింగర్ రామ్‌ మిర్యాల పాడిన ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. దీనికి ముందు సిద్ధు చెప్పిన డైలాగ్​ నవ్వులు పూయిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

DJ Tillu Square Crewఈ సీక్వెల్​ను గతేడాది దీపావళికి ప్రకటించింది చిత్ర బృందం. మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌ 15న విడుదల చేయాలని భావించారు. అయితే చిత్రీకరణ పూర్తి కాకపోవడం వల్ల వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

సిద్ధు జొన్నలగడ్డ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ హీరో నీరజ కోన దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇటీవలే దీని షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అలాగే నందినిరెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు సిద్ధు. మరోవైపు, అనుపమ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. డీజే టిల్లు స్క్వేర్​తో పాటు ప్రస్తుతం ఈ అమ్మడు మరో మూడు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో రవితేజతో 'ఈగల్', తమిళంలో 'సైరెన్', మలయాళంలో 'జేఎస్​కే' సినిమాలు సైన్ చేసిందీ అమ్మడు.

పవన్​ కల్యాణ్​ గురించి నేనెప్పుడూ చెప్పేది అదే- నాకన్నా ఎక్కువసార్లు వాళ్లే అలా చేశారు : నితిన్

ఓటీటీలోనూ దుమ్మురేపిన బాలకృష్ణ- గూగుల్​లో 'భగవంత్​ కేసరి' హవా!

Last Updated : Nov 27, 2023, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.