ETV Bharat / entertainment

'కస్టడీ' దెబ్బేసినా స్టార్ హీరోతో ఛాన్స్! - వెంకట్ ప్రభు విజయ్ దళపతి కాంబో

తమిళ దర్శకుడు వెంకట్​ ప్రభు రూపొందించిన 'కస్టడీ' బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. ఆయనకు స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్​ను అందుకున్నారని సమాచారం అందింది. ఆ వివరాలు..

Vijay thalapathy
'కస్టడీ' దెబ్బేసినా స్టార్ హీరోతో ఛాన్స్!
author img

By

Published : May 16, 2023, 9:10 AM IST

Updated : May 16, 2023, 9:25 AM IST

సౌత్​ ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంట్ అండ్ సక్సెస్​ఫుల్​ డైరెక్టర్లు ఉన్నారు. అలాంటి వారిలో తమిళ దర్శకుడు​ వెంకట్ ప్రభు ఒకరు. నటుడిగా, ప్లే బ్యాక్ సింగర్​గా కెరీర్​ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత దర్శకుడుగా మారి కోలీవుడ్​లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఓ సక్సెస్​ఫుల్ డైరెక్టర్​గా మంచి పేరు తెచ్చుకున్నారు. థ్రిల్లర్ స్టోరీస్, ఒరిజినల్ కంటెంట్​ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్​గా నిలుస్తున్నారు. 'మానాడు', 'రాక్షసుడు' తదితర డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన.. రీసెంట్​గా అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య--హీరోయిన్​ కృతిశెట్టితో కలిసి 'కస్టడీ' అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగు- తమిళంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్​ ముందు ఈ చిత్రం మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. వసూళ్ల విషయంలోనూ ఆకట్టుకోలేకపోయింది.

అయితే సాధారణంగా ఇండస్ట్రీలో ఓ చిత్రం రిజల్ట్​ ఎలా ఉన్నా దాన్ని పక్కన పెట్టి.. ఆ మూవీకి పనిచేసిన నటీనటులు, డైరెక్టర్​.. కాస్త గ్యాప్​ తీసుకుని తమ కొత్త సినిమాపై ఫోకస్ చేయడం ప్రారంభిస్తారు. అయితే 'కస్టడీ' రిజల్ట్​తో ప్రస్తుతం నాగ చైతన్య కాస్త డీలా పడగా.. దర్శకుడు వెంకట్ ప్రభు మాత్రం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా తన ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి స్పీడ్​గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తన ఫేవరెట్​ స్టార్ హీరోలు అజిత్ కుమార్, దళపతి విజయ్​ కోసం రెండు వేరే వేరు కథలను కూడా రెడీ చేసుకున్నారట. ఇప్పుడు వాళ్లతో సినిమా చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

ఈ క్రమంలోనే దళపతి విజయ్​తో కథపై చర్చలు కూడా జరిపారని కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందింది. దర్శకుడు చెప్పిన యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్​ విజయ్​ బాగా నచ్చిందని, దీంతో వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి కూడా కస్టడీకి మ్యూజిక్ అందించిన యువన్ శంకర్​ రాజా సంగీతం అందిస్తారట.

ఇకపోతే ప్రస్తుతం విజయ్.. లోకేశ్​ కనగరాజ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్​ 'లియో' సినిమాను చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తవ్వగానే వెంకట్ ప్రభుతో కలిసి సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాంబో ఇండస్ట్రీలో ఇంట్రెస్టింట్​గా మారింది.

ఇదీ చూడండి: Dootha webseries : చైతూ 'దూత' ఏమైనట్టు?

Last Updated : May 16, 2023, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.