ETV Bharat / entertainment

ఇంట్రెస్టింగ్​గా తరుణ్​ భాస్కర్​ 'కీడా కోలా'.. సీసాలో ఉన్న ఆ రహస్యమేంటో? - తరుణ్​ భాస్కర్ కొత్త సినిమా కీడా కోలా

Tarun bhaskar keeda cola teaser : క్రేజీ డైరెక్టర్​ తరుణ్ భాస్కర్.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'కీడా కోలా'. ఈ చిత్ర టీజర్​ రిలీజై ఆకట్టుకుంటోంది. ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మీరు చూశారా?

Tarun Bhaskar Keeda Cola
ఇంట్రెస్టింగ్​గా తరుణ్​ భాస్కర్​ 'కీడా కోలా'.. సీసాలో ఉన్న ఆ రహస్యమేంటో?
author img

By

Published : Jun 28, 2023, 3:27 PM IST

Tarun bhaskar keeda cola teaser : టాలెంటెడ్​ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కీడా కోలా'. తాజాగా ఈ సినిమా టీజర్​ రిలీజైంది. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాలు(ఐదేళ్ల తర్వాత) తరుణ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఎనిమిది ప్రధాన పాత్రల చుట్టూ ఈ కథ సాగుతోంది. ఇందులో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఓ కీలక పాత్ర పోషించారు.

ముందుగా కీడా కోలా అనే పేరున్న కూల్‍డ్రింక్ సీసాను చూపిస్తూ మొదలైన ఈ టీజర్​లో​ బ్రహ్మానందం, చైతన్య రావు తీక్షణంగా బాటిల్​ లోపల ఉన్న దాన్ని చూస్తూ కనిపించారు. 'ఏంట్రా అది' అని బ్రహ్మానందం అడగగా.. 'గ్రేప్స్ ఏమో' అని అంటారు చైతన్య.'గ్రేప్సా.. ఎలా బతికావురా ఇన్నాళ్లు నువ్వు' అని బ్రహ్మానందం తిరిగి డైలాగ్ చెప్పడం... 'నువ్వు.. నువ్వు బతుకుతలేవా.. అట్లనే' అంటారు చైతన్య. ఆ తర్వాత కీడా కోలా కోసమే మొత్తం కథ, అందులో పాత్రలు తిరుగుతున్నట్లు విజువల్స్​ చూపించారు. ఈ క్రమంలోనే ఫైటింగ్​లు, గన్స్‌తో ఛేజింగ్, యాక్షన్ సీన్లను సరదా సరదాగా చూపించారు. ఇందులో తరుణ్​ భాస్కర్​ నెగెటివ్ షేడ్స్​ ఉన్న క్యారెక్టర్ పోషించినట్టు అర్థమవుతోంది. చివరకు 'శ్వాస మీద ధ్వాస.. ఒస్తున్నాం' అంటూ ప్రచార చిత్రాన్ని ముగించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Tharun bhascker new movie : అయితే ఈ ప్రచార చిత్రంలో ఎక్కడా కథను రివీల్​ చేయకుండా సస్పెన్స్​ పెట్టారు. కీడా కోలా సీసాలో ఏదో దాగున్న రహస్యం కోసం వాళ్లంతా ఫైట్లు, ఛేజింగ్​లు చేయడం మాత్రమే చూపించారు. మరి ఆ బాటిల్​లో అంత సీక్రెట్ ఏముందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఏదేమైనప్పటికీ ఈ ప్రచార చిత్రం చూస్తుంటే తరుణ్ భాస్కర్ ఏదో కొత్తగా ప్రయత్నించబోతున్నట్లు అర్థమవుతోంది. ఆడియెన్స్​కు కూడా సినిమాపై మంచి ఆసక్తి కలిగేటట్టు ఉంది. ఇక ఈ టీజర్​కు వివేక్ సాగర్ అందించిన​ బ్యాక్‍‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా వైరెటీగా ఉంది. విజువల్స్ మొత్తం ఆసక్తి రేపెలా సాగాయి. సంభాషణలు ఎక్కువగా లేవు. ఫైనల్​గా ఈ టీజర్‌ను తరుణ్ భాస్కర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. "కష్టపడ్డాం. పాలమ్మినం. ఇగ అంతా మీదే. తీసుకోండి. ఫైర్ లేపాలి' అని క్యాప్షన్ రాసుకొచ్చారు. మరి ఈ సినిమా వర్కౌట్ అయితదో లేదో చూడాలి. కాగా, ఈ చిత్రాన్ని వివేక్ సుదాన్షు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ కలిసి సంయుక్తంగా నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇదీ చూడండి :

బ్రేక్స్​ ఫెయిల్​.. ప్రమాదం నుంచి తప్పించుకున్న విజయ్​!

'ఎవరైనా అలా చేసుంటే రాకేశ్‌ మాస్టర్‌ లైఫ్​ మరోలా ఉండేది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.