ETV Bharat / entertainment

18 pages movie: హీరో నిఖిల్​ అలాంటోడు కాదంటా..

హీరో నిఖిల్​ నటించిన 18 పేజీస్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అతడి గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే..

18 Pages
18పేజెస్‌
author img

By

Published : Dec 21, 2022, 9:45 AM IST

'కరెంట్‌', 'కుమారి 21ఎఫ్‌' లాంటి చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్‌. ఏడేళ్ల విరామం తర్వాత ఆయన నుంచి వస్తున్న మరో ప్రేమకథా చిత్రం '18పేజెస్‌'. నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించారు. దీనికి దర్శకుడు సుకుమార్‌ కథ అందించడంతో పాటు జీఏ2 పిక్చర్స్‌తో కలిసి స్వయంగా నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సూర్యప్రతాప్‌.

''నాకు కథలు రాయడం చాలా ఇష్టం. నా తొలి చిత్రం 'కరెంట్‌' పూర్తయ్యాక.. సుకుమార్‌ టీమ్‌లో చేరాను. అక్కడ నేను రచనలో కొత్త కొత్త కోణాలు అన్వేషించడం ప్రారంభించాను. అదే సమయంలో సుకుమార్‌కు 'కుమారి 21ఎఫ్‌' ఆలోచన వచ్చింది. నిజానికి దాన్ని ఆయనే తెరకెక్కించాలనుకున్నారు. దాన్ని పూర్తి స్క్రిప్ట్‌గా తీర్చిదిద్దాక.. ఆ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత నాకే అప్పగించారు. ఆ సినిమా హిట్టయ్యాక సుకుమార్‌ ఆలోచనలతో మరో మూడు కథలు సిద్ధం చేశాను. అయితే అప్పుడే 'రంగస్థలం'కు స్క్రీన్‌ రైటర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్‌.. నాకు చాలా ప్లస్‌ అవుతుందని చేశా. ఆ వెంటనే 'పుష్ప' చిత్రానికీ పని చేశా. ఈ ప్రయాణంలో చాలా విలువైన విషయాలు నేర్చుకున్నా''.

బోలెడన్ని భావోద్వేగాలు... ''సిద్ధు, నందిని కలిసి చేసిన ప్రయాణమే ఈ '18పేజెస్‌'. ఇది ఓ ఫీల్‌గుడ్‌ ప్రేమకథ మాత్రమే కాదు.. దీంట్లో బోలెడన్ని భావోద్వేగాలున్నాయి. సినిమా చూస్తున్నంత సేపూ సిద్ధు, నందినిల ప్రపంచంలోకి వెళ్లిపోతాము. వారి కథలోని సంఘర్షణ.. భావోద్వేగాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి. ఇందులో ప్రేమ, వినోదంతో పాటు థ్రిల్‌ చేసే అంశాలూ ఉన్నాయి. ఇది విషాదభరిత చిత్రం కాదు కానీ.. ముగింపు ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోతుంది''.

కథను మార్చలేదు.. ''నా దృష్టిలో కథ కంటే గొప్పది ఏదీ లేదు. నేను బలంగా నమ్మేది దాన్నే. నిఖిల్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు కాబట్టి నేను అతని ఇమేజ్‌కు తగ్గట్లుగా సినిమాలో కొన్ని మార్పులు చేశాను. అలాగని అవేమీ కథాపరంగా చెయ్యలేదు. నిఖిల్‌ కూడా తనకున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కథను మార్చమనే రకం కాదు. 'నాకు ఏ కథ చెప్పారో.. ఆ కథే తియ్యాలి ప్రతాప్‌' అనేవారు''.

వేగం పెంచుతా.. ''ఇకపై చకచకా సినిమాలు చేయాలనుకుంటున్నా. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఉంటుంది. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. నేను సుకుమార్‌ దగ్గర ఐదు కథలు తీసుకున్నా. వాటిలో రెండు పూర్తయ్యాయి. మిగతా మూడు త్వరలో చేయాలి. అలాగే నేనూ ఓ కథ రాసి పెట్టుకున్నా. అది ఓకే అయింది. త్వరలో వాటి వివరాలు ప్రకటిస్తా''.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.