ETV Bharat / entertainment

సుక్కు శిష్యుల క్రేజ్​​.. రిలీజ్​ కాకముందే ఆఫర్లే ఆఫర్లు! - కార్తీక్ దండుకు మరో ఛాన్స్​

ప్రస్తుతం చిత్రసీమలో దర్శకుడు సుకుమార్​ శిష్యులకు భారీగా డిమాండ్​ పెరిగుతోంది. వారికి అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే సుక్కు స్కూల్​ నుంచి వచ్చిన బుచ్చిబాబు సహా పలు దర్శకులు సూపర్​ ఛాన్స్​లను అందుకున్నారు. మరి కొంతమందికి అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయట. ఆ వివరాలు..

Director Sukumar demand
సుక్కు శిష్యుల క్రేజ్​​.. రిలీజ్​ కాకముందే ఆఫర్లే ఆఫర్లు!
author img

By

Published : Feb 2, 2023, 2:34 PM IST

హీరో, హీరోయిన్లకే కాదు కొందరు డైరెక్టర్లకూ అభిమానులు ఉంటారు. హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్‌ వారికి కూడా ఉంటుంది. అలాంటి వారిలో సుకుమార్‌ ఒకరు. ఆర్య సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన.. ప్రస్తుతం పుష్పతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దర్శకులుగా మారిన ఆయన శిష్యులు కూడా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే శిష్యులు ప్రయోజకులు అయినప్పుడు ఆ గురువు పడే సంతోషం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సుకుమార్ ఆ ఆనందాన్నే పొందుతున్నారు. ఈ లెక్కల మాస్టార్​ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్​గా పని చేసిన చాలామంది ఇప్పటికే మెగాఫోన్ పట్టి భారీ హిట్​లను అందుకోగా.. మరి కొంతమంది త్వరలోనే పరిచయం కానున్నారు. ఇప్పుడు చిత్రసీమలో సుకుమార్​ శిష్యుల డిమాండ్​ పెరిగిందనే చెప్పాలి. సుక్కు శిష్యుడితో సినిమా అంటే హీరోలు, నిర్మాతలు వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఉప్పెన సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా భారి హిట్​ను అందుకున్న బుచ్చిబాబు సుకుమార్​ ప్రియ శిష్యుడు. తొలి సినిమాతోనే రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్​తో ఏకంగా రామ్​చరణ్​తో ఆర్​ సీ 16 ప్రాజెక్ట్​ను పట్టేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్​ దాదాపు రూ.270కోట్లతో నిర్మించనుందని సమాచారం​. అయితే బుచ్చిబాబుకు మరిన్ని ఆఫర్స్​ కూడా వస్తున్నాయట. మరి అతడి అడుగులు ఎటువైపో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

కొత్త దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కించిన చిత్రం 'దసరా'. నాని, కీర్తిసురేశ్​ హీరోహీరోయిన్లు. అయితే ఈ డైరెక్టర్​ కూడా సుక్కు స్కూల్​ నుంచి వచ్చినవాడే. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇతడికి ప్రముఖ నిర్మాత​ దిల్ రాజు నుంచి పిలుపు వచ్చిందని తెలిసింది. మంచి ఆఫర్​ను ఇచ్చారట. చూడాలి మరి దసరా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో, ఇక దిల్​ రాజు-ఓదెల కాంబోలో ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుందో.

మరో యంగ్ హీరో సాయితేజ్‌ కథానాయకుడిగా కొత్త చిత్రం విరూపాక్ష. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈచిత్రం కార్తీక్​ దండు దర్శకత్వంలో రూపొందుతోంది. సుకుమార్‌ రైటింగ్స్‌, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇక టీజర్​తోనే ఆకట్టుకున్న కార్తీక్​ దండుకు సినిమా విడుదల కాకముందే మరిన్ని ఆఫర్స్​ వస్తున్నాయట. కానీ అతను వీరుపక్ష విడుదలయ్యాకే ఒప్పుకోవాలని అనుకుంటున్నాడట.

ఇకపోతే అంతకు ముందు కూడా సుకుమార్ శిష్యులు చాలా మందే మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కుమారి 21 ఎఫ్​, 18 పేజెస్​తో సూర్య ప్రతాప్, ప్లే బ్యాక్ సినిమాతో దర్శకుడు హరి ప్రసాద్ జక్కా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా దర్శకుడితో మున్నా .. ఇలా చాలా మందే ఉన్నారు.

ఇదీ చూడండి: రెడ్​ డ్రెస్​లో​ హాట్ లిప్స్​తో.. సదా అందాల ఘాటు అదిరింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.