ETV Bharat / entertainment

ప్రభాస్​తో మూవీ.. స్మాల్​ హింట్​ ఇచ్చిన మారుతి.. ఏంటంటే? - ప్రభాస్ మారుతి సినిమా హీరోయిన్స్​

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​తో చేయబోయే సినిమా గురించి ఓ హింట్ ఇచ్చారు దర్శకుడు మారుతి. దాన్ని సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు. అదేంటంటే..

Director Maruti gave update about his film with Pan India star Prabhas
ప్రభాస్​తో మూవీ.. స్మాల్​ హింట్​ ఇచ్చిన మారుతి.. ఏంటంటే?
author img

By

Published : Apr 6, 2023, 10:59 AM IST

'ప్రేమ కథా చిత్రమ్', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' చిత్రాలతో ఫన్​ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న​ మారుతి.. తన సినిమాలతో అటు మాస్​ ఇటు క్లాస్ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకోగలరు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి కామెడీని అందిస్తారు. అయితే హాస్యం మాత్రమే కాదు మంచి కథ కూడా ఆయన సినిమాల్లో ఉంటుంది. అయితే ఇప్పుడాయన పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఆయన పాన్​ ఇండియా డైరెక్టర్​గా మారబోతున్నారు. సినిమా గురించి అధికారికంగా ప్రకటించకపోయినా... అప్పుడప్పుడు హింట్​లను ఇస్తూనే ఉన్నారు. రెండు మూడు సార్లు సెట్​కు సంబంధించిన ఫొటోలు కూడా లీక్​ అయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మారుతి సోషల్​మీడియాలో ఓ ట్వీట్ చేశారు. 'మెన్​ ఎట్​ వర్క్'​ అంటూ క్యాప్షన్​ రాసుకొచ్చారు. దీంతో అది ప్రభాస్ సెట్స్​లోకి అడుగుపెట్టి ఉంటారని ఫ్యాన్స్​, నెటిజన్లు భావిస్తున్నారు. ఇలా హింట్​లు ఇచ్చే బదులు.. ఓ అప్డేట్​ ఇవ్వచ్చు కదా అని కామెంట్లు కూడా పెడుతున్నారు.

కాగా, ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ కూడా ప్రారంభమైపోయింది. కీలకమైన సన్నివేశాలను రూపొందించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సెట్స్​లోకి ప్రభాస్​ అడుగుపెట్టారన్న మాట! ఇకపోతే ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, 'రాధే శ్యామ్' సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసిన రిద్ధి కుమార్ సెలెక్ట్​ అయ్యారని తెలిసింది. హారర్​ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా కథ ఏంటనేది సస్పెన్స్​. ఎవరు ఏఏ పాత్రలో కనిపించనున్నారో తెలీదు. అసలే ప్రభాస్ కామెడీ టైమింగ్ చూసి ఫ్యాన్స్​కు చాలా కాలం అయిపోయింది. ఇక ఈ సినిమా టైటిల్ 'రాజు డీలక్స్' అంటూ ప్రచారంలో ఉంది. మరి అదే ఫైనల్​ చేసి అనౌన్స్​ చేస్తారో లేదంటే మారుస్తారో చూడాలి.

ఇకపోతే ప్రభాస్​ నటించిన భారీ బడ్జెట్​ బాలీవుడ్ ప్రాజెక్ట్ 'ఆదిపురుష్​'.. హనుమాన్ జయంతి సందర్భంగా ఓ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. ఈ చిత్రంలో శ్రీరాముని పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. జూన్ 16న చిత్రం గ్రాండ్​గా విడుదల కానుంది. ఆ తర్వాత ప్రభాస్​ నటించిన మరో పక్కా యాక్షన్​ ఎంటర్​టైనర్​ 'సలార్' సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఈ చిత్రాల తర్వాత మారుతి సినిమా రిలీజ్ అవుతుందో లేదంటే వీటి మధ్యలోనే విడుదల అవుతుందో చూడాలి.

ఇదీ చూడండి:'ఆదిపురుష్'​ హనుమాన్​ వచ్చేశాడు.. 'ఉస్తాద్‌' ఊచకోత..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.