ETV Bharat / entertainment

Dil Raju Game Changer Movie Update : అదేంటి.. ఆ విషయం దిల్​ రాజుకు కూడా తెలియదా? - గేమ్​ ఛేంజర్​ మూవీ పై దిల్​ రాజు కామెంట్స్

Dil Raju Game Changer Movie Update : రామ్​చరణ్- శంకర్​ కాంబినేషన్​లో రూపొందుతున్న 'గేమ్​ ఛేంజర్' సినిమా అప్డేట్​ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ టీమ్​ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్​ను ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా మూవీ నిర్మాత దిల్​ రాజు ఈ విషయంపై స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

Dil Raju Game Changer Movie Update
Dil Raju Game Changer Movie Update
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 10:10 PM IST

Dil Raju Game Changer Movie Update : గ్లోబల్ స్టార్​ రామ్​చరణ్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజర్‌'. తమిళ దర్శకుడు శంకర్​ రూపొందిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీంతో అభిమానులు ఈ చిత్రం గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్​ వస్తుందో అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 'గాండీవధారి అర్జున' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సినీ నిర్మాత దిల్‌ రాజు హాజరయ్యారు. ఇక వేదికపై ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆడియెన్స్​ అందరూ ఆయన్ను 'గేమ్‌ ఛేంజర్‌' అప్‌డేట్‌ ఇవ్వమని కోరారు. అప్‌డేట్​ కావాలంటే శంకర్‌ను అడగాలని.. ఆయన మాత్రమే 'గేమ్‌ ఛేంజర్‌' గురించి చెబుతారని తెలిపారు. ఆయన చెప్పే వరకూ మనం వేచి ఉండాలని అన్నారు.

Ram Charan Game Changer Movie : రామ్​చరణ్​ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్'​ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన రెండు విషయాలు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అదేంటంటే.. ఈ సినిమాలోని క్లైమాక్స్‌ హైలైట్‌ ఉంటుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15కి విడుదల చేయనున్నారని వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ డ్యూయెల్​ రోల్​లో కనిపించనున్నారని టాక్​.

కొన్నిరోజులు బ్రేక్​ తీసుకున్న తర్వాత రామ్​చరణ్ 'గేమ్​ ఛేంజర్​' షూటింగ్​లో ఇటీవలే పాల్గొన్నారు. రాజకీయ నేపథ్యంతో ముడిపడి ఉన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ఇక ఈ సినిమాలో రామ్​ చరణ్​, కియారాతో పాటు శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Ram Charan Buchi Babu Sana Movie : మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్చరణ్‌ నటించనున్న మూవీకి సంబంధించి కూడా మరో క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభించి చివరిలో రిలీజ్​ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టార్స్​ ఎంపిక కూడా జరిగినట్లు సమాచారం. హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌, విలన్​గా విజయ్‌సేతుపతిని తీసుకోనున్నారట. అలాగే ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వచ్చే ఏడాది రామ్‌ చరణ్‌కు సంబంధించిన రెండు సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

'గేమ్​ ఛేంజర్​' సెట్స్​లో శంకర్​ బర్త్​డే సెలబ్రేషన్స్.. దిల్​ రాజు, చెర్రీ ఏం చేశారో తెలుసా?

Ram Charan Game Changer : రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్".. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.