ETV Bharat / entertainment

'సార్​' వచ్చేస్తున్నారు.. ఇదో కొత్త 'ప్రేమదేశం'..

ప్రేక్షకులను అలరించడానికి తెలుగులో వరుస సినిమాలు క్యూ కడుతున్నాయి. దసరా సందర్భంగా కొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా.. మరి కొన్ని సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఆ చిత్రాల గురించి తాజా అప్డేట్లు ఇవే..

movie updates
sir tiger nageshwarrao prema dehsam like share and subscribe movie updates
author img

By

Published : Sep 20, 2022, 8:48 AM IST

Dhanush Sir Movie : ధనుష్‌ - వెంకీ అట్లూరి కలయికలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మేనన్‌ కథానాయిక. ఈ చిత్రానికి తెలుగులో 'సార్‌', తమిళంలో 'వాతి' అనే టైటిల్స్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఈఏడాది డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను నెట్టింట పంచుకుంది.

sir
సార్

ఆ పోస్టర్‌లో ధనుష్‌ క్లాస్‌ రూంలో టేబుల్‌పై కూర్చొని.. విద్యార్థులకు గణితం బోధిస్తూ కనిపించారు. "డిసెంబరు 2 నుంచి ఈ సార్‌ తరగతులు వినడానికి అందరూ సిద్ధంగా ఉండండి" అంటూ ఆ ఫొటోకు ఓ వ్యాఖ్యను కూడా జోడించారు. విద్యా వ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణమే ఈ చిత్ర కథ. ఈ ప్రయాణంలో సార్‌కు ఎదురైన సమస్యలు, సంఘటనలు ఆయన జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి.ప్రకాష్‌ స్వరాలందిస్తుండగా.. జె.యువరాజ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇదో కొత్త 'ప్రేమదేశం'
"చిన్న వయసులో హీరో కావడంతో కాలేజీ రోజుల్ని మిస్‌ అయ్యాను. ఈ సినిమా నాకు ఆ రోజుల్ని గుర్తు చేసింది" అన్నారు త్రిగుణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'ప్రేమదేశం'. మేఘా ఆకాష్‌ కథానాయిక. మాయ, అజయ్‌ కతుర్వార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ సిద్ధమ్‌ దర్శకత్వం వహించారు. శిరీష సిద్ధమ్‌ నిర్మాత. మణిశర్మ స్వరకర్త. అక్టోబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

prema dehsam
ప్రేమదేశం

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా త్రిగుణ్‌ మాట్లాడుతూ "తల్లి కొడుకుల బంధం నేపథ్యంలో నేను చేసిన సినిమాలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇందులో నాకు అమ్మగా మధుబాల నటించారు. మేఘ ఆకాష్‌తో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉంది" అన్నారు. ఈ చిత్రంలోని 'తెలవారెనే సామి..' అంటూ సాగే పాటని సోమవారం విడుదల చేశారు.

'లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌'..
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న చిత్రం 'లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌'. సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఆముక్త క్రియేషన్స్‌, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు నితిన్‌ విడుదల చేశారు.

share and subscribe
లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌

క్రైమ్‌, కామెడీ మేళవింపుతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు టీజర్‌ స్పష్టం చేస్తోంది. ట్రావెల్‌ బ్లాగర్‌ పాత్రల్లో నాయకానాయికలు సందడి చేయనున్నారు. నేను మనసుని చూసి ప్రేమిస్తా అంటూ కథానాయకుడు టీజర్‌లో చేసిన హంగామా నవ్విస్తోంది. నితిన్‌తో 'మేస్ట్రో' చేసిన అనంతరం మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. నెల్లూరు సుదర్శన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ఛాయాగ్రహణం: వసంత్‌.

ఇవీ చదవండి: 'నటిగా నాకు కొన్ని పరిమితులున్నాయి.. నేను చాలా స్ట్రాంగ్'

ట్రెండీ వేర్​లో బాలీవుడ్​ భామల స్టన్నింగ్​ లుక్స్​.. చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.