Dhanush Aishwarya Divorce : తమిళనటుడు ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్‌లలో వారి పేర్లను మార్చుకుని వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తొలగించారు. అయితే తాజాగా వీరి విడాకులు రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. వారి కుటుంబాలు రజనీకాంత్ నివాసంలో సమావేశమయ్యాయని అక్కడ చర్చలు జరిగాయని వారిద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నారని అంటున్నారు.
వీరిద్దరు విడిపోతున్నట్లు ఈ ఏడాది జనవరి 27న ధనుష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.. "18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేనూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం" అని ధనుష్ లేఖలో పేర్కొన్నారు. తాజాగా వస్తున్న వార్తలపై మాత్రం అటు ధనుష్ కానీ, ఇటు ఐశ్వర్య కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి: ఎయిర్పోర్ట్లో కరీనాకు చేదు అనుభవం.. సెల్ఫీ కోసం ఒక్కసారిగా భుజంపై చేయి..