ETV Bharat / entertainment

Devil Release Postponed : నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. ఆ కారణాల వల్ల 'డెవిల్' వాయిదా - కల్యాణ్ రామ్ డెవిల్ లేటెస్ట్ న్యూస్

Devil Release Postponed : కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' వాయిదా పడింది. ఆ వివరాలు.

Devil Release Date postponed : నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. ఆ కారణాల వల్ల 'డెవిల్' వాయిదా

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 1:19 PM IST

Devil Release Postponed : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా పీరియాడిక్ యాక్షన్ చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్'.. అనేది ట్యాగ్ లైన్​. సంయుక్తా మేనన్​ కథానాయికగా నటించింది. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ - సంయుక్త కలిసి మరోసారి నటించిన చిత్రమిది. నవంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడా తేదీకి సినిమా రావడం లేదని, వాయిదా వేసినట్లు తెలిసింది.

బ్యాక్​గ్రౌండ్ స్కోర్​, విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) వర్క్ ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల థియేటర్లలోకి ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం అందింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందివ్వడం కోసం చిత్ర బృందం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని 'డెవిల్' యూనిట్ పేర్కొనట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, 'డెవిల్' సినిమాను రిలీజ్​ చేయాలనుకున్న నవంబర్ 24కు తేదీకి... శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన 'కోట బొమ్మాళి పీఎస్' రిలీజ్ అవ్వనుంది.

Devil Movie Cast And Crew : ఇకపోతే డెవిల్ చిత్రంలో మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా యంగ్ హీరోయిన్ మాళవికా నాయర్ కనిపించనుంది. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్‌ నరౌజి నటించింది. రీసెంట్​గా ఈ ఇద్దరి ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి కథ - కథనం - సంభాషణలు : శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర రాజన్‌, సంగీతం : హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : గాంధీ నడికుడియార్‌, కథా విస్తరణ : ప్రశాంత్‌ బారది, కూర్పు : తమ్మిరాజు, కాస్ట్యూమ్‌ డిజైనర్ : విజయ్‌ రత్తినమ్‌ ఎంపీఎస్‌ఈ, నిర్మాణ సంస్థ : అభిషేక్‌ పిక్చర్స్, సమర్పణ : దేవాంశ్‌ నామా, నిర్మాణం, దర్శకత్వం: అభిషేక్‌ నామా.

  • 🚨 Important Update 🚨 Unfortunately, the release of our highly anticipated film 'Devil' will be postponed from 24th November 🎥⏰ The delay is due to unexpected technical issues with the background score and VFX .Rest assured, we're working tirelessly to ensure an unforgettable…

    — Vamsi Kaka (@vamsikaka) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Thangalam Teaser : విక్రమ్​ ఇంత వైల్డ్​గా ఉన్నాడేంట్రా.. పామును చేత్తోనే రెండు ముక్కలు చేసి..

JIO World Plaza Celebrities : అందాల తారల ర్యాంప్ వాక్​ షో.. జిగేల్​మనిపించేలా అందాలన్నింటినీ ఆరబోస్తూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.