ETV Bharat / entertainment

'దేవర' న్యూఇయర్ అప్డేట్- ఫస్ట్ గ్లింప్స్ డేట్ అనౌన్స్ చేశారోచ్ - దేవర గ్లింప్స్

Devara Update: పాన్ఇండియా స్టార్ జూ. ఎన్​టీఆర్ కొత్త చిత్రం దేవర నుంచి కీలక అప్డేట్ వచ్చింది. న్యూఇయర్ సందర్భంగా మూవీమేకర్స్ ఎన్​టీఆర్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్ చెప్పారు.

Devara Update
Devara Update
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 11:13 AM IST

Updated : Jan 1, 2024, 11:26 AM IST

Devara Update: జూ. ఎన్​టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' నుంచి న్యూఇయర్ సందర్భంగా కీలక అప్డేట్ ఇచ్చింది మూవీటీమ్. జనవరి 8న సినిమా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరో ఎన్​టీఆర్ కూడా ట్విట్టర్​ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, జనవరి 8న దేవర గ్లింప్స్ రానున్నట్లు ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ఎన్​టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్​పై సంయుక్తంగా భారీ బడ్జెట్​తో ఈ సినిమా రూపొందుతోంది.

  • అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! Wishing you all a very Happy New Year.

    Can’t wait for you all to experience the glimpse of #Devara on Jan 8th. pic.twitter.com/RIgwmVA6e0

    — Jr NTR (@tarak9999) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేవరలో కల్యాణ్ రామ్: దేవర సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్, జూ. ఎన్​టీఆర్​తో స్క్రీన్ షర్ చేసుకున్నారని పలు వెబ్​సైట్​లలో కథనాలు వస్తున్నాయి. ఆయన ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ థియేటర్లలో ఫ్యాన్స్​ గూస్​బంప్స్​ తెప్పిస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. మరి నిజంగానే కల్యాణ్ రామ్ ఈ సినిమాలో నటించారా? లేదా అని తెలియాల్సి ఉంది. ఈ విషయంపై మూవీయూనిట్​ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

అంచనాలు మించి: అయితే డెవిల్ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా కల్యాణ్ రామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఓ సందర్భంలో దేవర గురించి ప్రస్తావన రాగా, ఫ్యాన్స్ అంచనాలు మించేలా ఈ సినిమా రూపొందుతుందని కల్యాణ్ రామ్ అన్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందన్న ఆయన, అప్డేట్ గురించి ఫ్యాన్స్ అడుగుతుంటే ఒత్తిడి కలుగుతుందన్నారు. కాగా, దేవర సినిమాకు కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Devara Cast: ఈ సినిమాలో అలనాటి దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దేవరలో విలన్​గా నటిస్తున్నారు. ఇక సీనియర్ హీరో శ్రీకాంత్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, శినే టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

'నేనూ తమ్ముడు అందుకే సైలెంట్​గా ఉన్నాం - క్లారిటీ వచ్చే వరకు ఏదీ చెప్పం'

'దేవర' అప్​డేట్​పై కల్యాణ్​ రామ్​ కామెంట్స్​ - 'తప్పు జరిగితే మీరు ఊరుకుంటారా?'

Last Updated : Jan 1, 2024, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.