బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ నటించిన 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్ బుధవారం విడుదలైంది. ట్రైలర్‌కు మిశ్రమ స్పందన వస్తున్నా.. ఓ పాత్ర గురించి మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చ నడుస్తోంది. అదే సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు సంబంధించిన ఓ సీన్! ఆ పాత్రను ట్రైలర్లో రివీల్ చేయకున్నా.. ఓ సీన్లో వెనకవైపు నుంచి కనిపించేది ఆయనే అంటూ బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో షారుక్.. ఓ శాస్త్రవేత్త పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తోంది.
అయితే మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే 'బ్రహ్మాస్త్రం'లో.. రణ్‌బీర్ మాజీ ప్రేయసి, అగ్రతార దీపికా పదుకొణె కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు దీపిక ఓకే చెప్పిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సమాచారమే నిజమైతే.. వివాహం అనంతరం వీరు కలిసి నటిస్తున్న సినిమా ఇదే అవుతంది.
2015లో వచ్చిన 'తమాషా' తర్వాత రణ్‌బీర్-దీపిక జంటగా నటించలేదు. 2018లో రణ్వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రణ్‌బీర్‌తో కలిసి కనపడలేదు దీపిక. రణ్‌బీర్ కూడా తన ప్రేయసి ఆలియా భట్‌ను ఇటీవలే వివాహం చేసుకున్నాడు.
'బ్రహ్మాస్త్రం'.. సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రాన్ని దక్షిణ భారతదేశంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేస్తున్నారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్, నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: మరోసారి లవర్‌బాయ్‌గా చైతూ అదుర్స్.. అగ్ర హీరోలతో సమంత ఢీ