ETV Bharat / entertainment

మహిళా కమిషన్ చీఫ్​కు రేప్ వార్నింగ్.. 'ఆ బిగ్​బాస్ కంటెస్టెంట్​ను బహిష్కరించండి' - షెర్లీన్ చోప్రా సల్మాన్ ఖాన్

హిందీ బిగ్​బాస్​ 16 కంటెస్టంట్ సాజిద్ ఖాన్​పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా అతడిపై దిల్లీ మహిళ కమిషన్ చీఫ్..​ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను రేప్​ చేస్తామంటూ దుండగులు బెదిరిస్తున్నారు.

DCW chief Swati Maliwal
DCW chief Swati Maliwal
author img

By

Published : Oct 12, 2022, 7:52 PM IST

దిల్లీ మహిళా కమిషన్ చీఫ్​ స్వాతి మలివాల్​కు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఇలాంటి మెసేజ్​లు వస్తున్నాయని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. ఈ మేరకు తన ఇన్​స్టా మెసెజ్​ల స్క్రీన్​ షాట్​లను షేర్​ చేశారు. "మేము చేసే పని ఆపడానికే.. వారు ఇలా చేస్తున్నారు. ఎఫ్​ఐఆర్​ నమోదు చేయమని దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. దర్యాప్తు చేసి దీని వెనుక ఎవరున్నారో వారిని అరెస్ట్ చేయాలని కోరబోతున్నా" అని స్వాతి ట్వీట్​ చేశారు.

అయితే ఆమె బిగ్​బాస్16​ కంటెస్టెంట్​ సాజిద్ ఖాన్​పై.. మీటూ ఉద్యమంలో భాగంగా తమను లైంగికంగా వేధించాడని కొందరు మహిళలు ఆరోపణలు చేశారు. దీంతో అతడిని వెంటనే ఆ షో నుంచి బయటకు పంపించాలని దిల్లీ మహిళా కమిషన్ చీఫ్​ స్వాతి మలివాల్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు బుధవారం లేఖ రాశారు. ఆమె సాజిద్​ ఖాన్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రైమ్​ టైమ్​లో వచ్చే బిగ్​బాస్​ షోలో సాజిద్ ఖాన్​ లాంటి 'లైంగిక వేటగాడు' సరైంది కాదు అని రాసుకొచ్చారు. దీంతో ఆమెను రేప్​ చేస్తామంటూ పలువురు దుండగులు సోషల్​ మీడియా వేదికగా మెసేజ్​లు చేస్తున్నారు.

సల్మాన్​ ఏం చేస్తున్నారు?
సాజిద్ ఖాన్​ కాంట్రవర్సీపై బాలీవుడ్ నటి షెర్లీన్​ చోప్రా స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సాజిద్ ఖాన్​ను షోలోకి ఎందుకు తీసుకున్నారని ఆమె సల్మాన్​ను ప్రశ్నించారు.

ఇవీ చదవండి: ఒంటిపై దుస్తులన్నీ విప్పేసిన నటి.. ఇరాన్ మహిళలకు సంఘీభావం

కొడుకు​ చేసిన ఆ పనికి షో మధ్యలోనే ఏడ్చేసిన అమితాబ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.