Aadi Crazy Fellow Pre Release Event: ఆది సాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి తెరకెక్కించిన చిత్రం 'క్రేజీ ఫెలో'. దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్ కథానాయికలు. ఈ సినిమాని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా చిత్ర బృందం ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నటుడు శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
వేడుకనుద్దేశించి శర్వానంద్ మాట్లాడుతూ.. "సాయికుమార్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన తనయుడు ఆది నాకు తమ్ముడులాంటివాడు. ఆది విజయం అందుకుంటే ఆనందపడే వ్యక్తుల్లో ముందు నేనుంటా. 'క్రేజీ ఫెలో'ని చూస్తుంటే ‘రన్ రాజా రన్’ ఫ్లేవర్ కనిపిస్తోంది. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని శర్వానంద్ అన్నారు.
"నేను అడిగిన వెంటనే ఓకే అని చెప్పి, వేడుకకు విచ్చేసిన శర్వా అన్నకు థ్యాంక్స్. ఈ సినిమా స్క్రిప్టుపై మేం నమ్మకంగా ఉన్నాం. లవ్, కామెడీ, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చాలా సరదాగా షూటింగ్ పూర్తి చేశాం. ఈ సినిమాని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని ఆది సాయికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, సంపత్ నంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 100 ఆడిషన్స్‌కు వెళ్లా.. అందరూ రిజెక్ట్ చేశారు.. కానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీ: దివి