Ranveer Singh Photoshoot: బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు ముంబయి పోలీసులు. ఇటీవల రణ్వీర్ న్యూడ్ ఫొటోషూట్‌పై కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించనున్నారు. సమన్లు జారీ చేసేందుకు ముంబయి పోలీసులు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లారు. కానీ రణ్వీర్ ప్రస్తుతం ముంబయిలో లేని కారణంగా నోటీసులు అందించడం సాధ్యం కాలేదు. ఆగస్టు 16న తిరిగివస్తానని రణ్వీర్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ రోజు మళ్లీ పోలీసులు వెళ్లి నోటీసులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 22న స్టేట్మెంట్ నమోదు చేసేందుకు ఆయనను పిలుస్తామని స్పష్టం చేశారు.
ఇటీవలే పోస్ట్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ ప్రస్తుతం చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆయన దిగిన ఫొటోలు బాగా వైరల్‌గా మారాయి. అయితే ఇది వివాదస్పదమైంది. రణ్వీర్ను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు తప్పుబడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జులై 26న ముంబయిలోని చెంబూర్ పోలీస్ స్టేషన్లో రణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ ఎన్జీఓ సంస్థ ఈ కంప్లైంట్ ఇచ్చింది. రణ్వీర్.. మహిళల మనోభావాలను దెబ్బతీశాడని, వారిని అవమానించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేసింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణవీర్ 'సర్కస్', 'రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ' అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన భార్య హీరోయిన్ దీపికా పదుకోణె.. 'ప్రాజెక్ట్ K', 'పఠాన్' చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: కదలలేని స్థితిలో కైకాల.. బైడ్పైనే కేక్ కట్ చేయించిన చిరు