ETV Bharat / entertainment

'దానికి వాళ్లే కారణం.. రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా' - అల్లరి నరేశ్ గీతా సింగ్ కితకితలు

తెలుగు సినిమాల్లో కమెడియన్లకు మొదటి నుంచీ ప్రాధాన్యం ఉంది. సినిమాల్లో ప్రేక్షకులకు వినోదం పంచి.. కితకితలు పెట్టి నవ్విస్తారు ఈ కమెడియన్లు. అలాంటి ఓ కమెడియనే​ 'కితకితలు' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న​ గీతా సింగ్. ఇప్పుడామె ప్రేక్షకులతో తన కన్నీటి గాథను ప్రేక్షకులతో పంచుకుంది.

comedian geetha singh
comedian geetha singh
author img

By

Published : Oct 16, 2022, 3:21 PM IST

తెలుగు తెరపై హాస్యనటిగా మెప్పించింది నటి గీతా సింగ్. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడుతూ తన కెరీర్‌, జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపింది.

"'కితకితలు' సినిమా కంటే ముందు నేను కాస్త సన్నగానే ఉండేదానిని. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చెప్పడం వల్లే బరువు పెరిగా. ఆ చిత్రమే నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. ఇప్పటికీ నన్ను అందరూ గుర్తు పెట్టుకున్నారంటే ఈవీవీ, అల్లరి నరేశే కారణం. ఆయనే బతికి ఉంటే నాలాంటి ఎంతోమంది కమెడియన్స్‌కు పండగలా ఉండేది. ఇప్పుడు పరిశ్రమలో పురుషాధిక్యం ఉంది. నాలాంటి లేడీ కమెడియన్స్‌కు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. నాలాగే ఉండే మరో అమ్మాయిని చెన్నై నుంచి తీసుకువచ్చి ఇక్కడ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. బాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నుంచి నాకొకసారి ఆఫర్‌ వచ్చింది. అది ఫేక్‌ అనుకుని ఆఫర్‌ వదిలేసుకున్నా"

"చిన్నప్పటి నుంచి మా మేనత్తే నన్ను పెంచింది. ఆమె మరణించినప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యా. ఆ తర్వాత నాన్న, అన్నయ్య చనిపోవడం వల్ల.. కుటుంబ బాధ్యత నాపై పడింది. ఇక, పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. అయినవాళ్లు కూడా నన్ను మోసం చేశారు. ఇండస్ట్రీలో తెలిసినవాళ్లు సైతం డబ్బు తీసుకుని మోసం చేశారు. కెరీర్‌ మొదలైన కొత్తలో డబ్బులు కూడబెట్టి చిట్టీలు కట్టా. వాళ్లు డబ్బు మొత్తం కాజేశారు. ఆ సమయంలో రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించా. నా స్నేహితురాలు అడ్డుపడి నన్ను బతికించింది" అంటూ గీతాసింగ్ భావోద్వేగానికి గురైంది.

ఇవీ చదవండి :బుల్లితెరపై మాస్ సంగమం.. 'అన్​స్టాపబుల్'​ షోలో పవన్​ కల్యాణ్?

'సలార్‌' నుంచి న్యూ అప్డేట్​.. యాంగ్రీ లుక్‌లో స్టార్​ హీరో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.